Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు విడుదలపై లేటెస్ట్ అప్డేట్.. అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్
Hari Hara Veera Mallu Release Date: పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చారిత్రక యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ, క్రిష్ కలిసి దర్శకత్వం వహించారు.
Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు విడుదలపై లేటెస్ట్ అప్డేట్.. అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్
Hari Hara Veera Mallu Release Date: పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చారిత్రక యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ, క్రిష్ కలిసి దర్శకత్వం వహించారు. నిర్మాత ఎ.ఎం. రత్నం. ఇప్పటికే అనేక కారణాల వల్ల ఈ సినిమా విడుదల తరచూ వాయిదా పడింది. చివరిసారిగా జూన్ 12న విడుదల చేస్తామని ప్రకటించిన చిత్ర బృందం, తాజాగా ఆ తేదీకి సినిమా విడుదల కాదని అధికారికంగా ప్రకటించింది.
"ఈ సినిమా కోసం ఎప్పటికీ మద్దతుగా నిలిచిన అభిమానులు, సినీప్రేక్షకులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముందుగా ప్రకటించిన తేదీకి సినిమాను విడుదల చేయాలని అహర్నిశలు శ్రమించాం. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. పవన్ కల్యాణ్‌కు ఉన్న భారీ ఇమేజ్‌కు తగ్గట్టుగా ప్రతీ సన్నివేశాన్ని మెరుగ్గా తీర్చిదిద్దే పనిలో మేము నిమగ్నమై ఉన్నాం. అందుకే మేము మరికొంత సమయం తీసుకోవాల్సి వచ్చింది అని ప్రకటించారు.
ఇక అభిమానులను ఉద్దేశిస్తూ.. మీరు ఎదురుచూస్తున్న ఈ సినిమాను మరింత అద్భుతంగా మలిచే ప్రయత్నంలో ఉన్నాం. ఫేక్ న్యూస్‌లు నమ్మకండి. ట్రైలర్ త్వరలో విడుదల చేస్తాం. అలాగే కొత్త విడుదల తేదీని కూడా అధికారికంగా వెల్లడిస్తాం. అని క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోన్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా విడుదల చేయనున్నారు.