Pawan Kalyan: మగువలకు కానుక ఇచ్చిన 'వకీల్ సాబ్'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'వకీల్ సాబ్' నుంచి మగువా మగువా సాంగ్ రిలీజ్ అయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'వకీల్ సాబ్' నుంచి మగువా మగువా సాంగ్ రిలీజ్ అయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. రెండేళ్ళ విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నారు.రెండేళ్ల తర్వాత సినిమాలు మొదలు పెట్టిన పవన్ సామాజిక అంశాల నేపథ్యంలో సినిమాలను తీస్తున్నారు. బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
కాగా.. మార్చ్ 8న ఉమెన్స్ డే సందర్భంగా 'మగువ మగువ' లిరీకల్ వీడియో పాటను రిలీజ్ చేశారు. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమో సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రోమో పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా విడుదలైన లీరికల్ పాటను సిధ్ శ్రీరామ్ పాడారు. పవన్ అభిమానులు ఈ పాట విని పండగ చేసుకుంటున్నారు.
'మగువ మగువ.. ఈ లోకానికి తెలుసా నీ విలువా' అంటూ సాగే ఈ పాట రామజోగయ్య శాస్త్రి రచించారు. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిలీజ్ అయిన కొన్ని రెండు గంటల్లోనే లక్షల మంది వీక్షించారు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నివేదా థామస్, అనన్య, అంజలి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 15న వకీల్ సాబ్ విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.