ఎన్నికలు దగ్గరపడనున్నాయి.. ఇంకొక్క సినిమాకు మాత్రమే కాల్షీట్లు.. ఒప్పుకున్న సినిమాలను పవన్ గట్టెక్కిస్తారా..?

Pawan Kalyan: ఇటు పాలిటిక్స్‌లోనూ బిజీబిజీగా ఉంటున్న పవన్ పొలిటికల్ హడావుడితో షూటింగ్స్‌కు బ్రేక్

Update: 2022-12-06 16:00 GMT

Pawan Kalyan: సుజిత్ కాంబినేషన్‌లో మరో మూవీకి పవన్ ఓకే 

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్‌లో మరో కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్ రాగానే ఇటు పొలిటికల్.. అటు సినీ ఇండస్ట్రీలో చర్చలు జోరందుకున్నాయి. ఓ వైపు ఏపీలో ఎన్నికలు దగ్గరపడనున్నాయి. మరోవైపు చేతిలో ఉన్న సినిమాలే ఇంకా ఎప్పుడు పూర్తవుతాయో తెలియని సిచ్యువేషన్. ఇలాంటి సమయంలోనే పవన్ మరో సినిమా ఒప్పుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఒప్పుకున్న సినిమాలను పవన్ గట్టెక్కిస్తారా లేదా? ఈ రెండు పడవల మీద ప్రయాణాన్ని పవన్‌ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటూ వినిపిస్తున్న ప్రశ్నలతో.. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలోని ఫ్యాన్స్ లో టెంపరేచర్‌ అమాంతం పెరిగిపోయింది.

హిట్టు, ఫ్లాపుల లెక్కలతో సంబంధం లేకుండా ఓ రేంజ్‌లో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అటు పొలిటికల్ కెరీర్‌లోనూ రోజురోజుకు ఛరిష్మాను పెంచుకుంటున్న లీడర్‌గా ఏపీలో పాగా వేసేశారు. పవన్ చివరిసారిగా భీమ్లా నాయక్‌ మూవీతో ఫ్యాన్స్‌కు కావాల్సినంత ఎంటర్‌టైన్ అందించి.. సూపర్ హిట్ టాక్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఓవైపు పాలిటిక్స్‌లో బిజీగా ఉంటూనే మరోవైపు వరుస సినిమాలతో బిజీ ష్కెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. ఒక పక్క హరిహర వీరమల్లు చిత్రం చేస్తూనే.. వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఆ లైన్‌లోనే డీవీవీ ఎంటర్‌‌టైన్మెంట్‌లో యంగ్ డైరెక్టర్ సుజిత్‌తో కలిసి పవన్ కళ్యాణ్‌ మూవీ చేస్తున్నట్లు రిలీజైన పోస్టర్.. ప్యాన్స్‌లో హైప్‌ను పెంచేసింది. 

ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతూ రికార్డ్ స్థాయిలో లైక్స్‌ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. పవన్‌కు కాంబినేషన్‌గా.. సాహో లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత సుజిత్ చేస్తున్న మూవీ కావడం కూడా ఈ భారీ హైప్‌కి కారణమనే చెప్పొచ్చు. దీంతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై హరీశ్ శంకర్ డైరెక్షన్లో కూడా సినిమా చేయబోతున్నారు. ఈ ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో రాబోతోంది. అయితే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత సుజిత్, హరీశ్ శంకర్ సినిమాలకు మాత్రమే కాల్షీట్లు ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ రెండు సినిమాల రాకతో ఆల్రెడీ అనుకున్న 2 సినిమాలు ఇప్పుడు డైలమాలో పడ్డాయి.

సముద్రఖని డైరెక్షన్‌లో పీపుల్ మీడియా బ్యానర్‌పై "వినోదాయశితం" రీమేక్ మూవీ చేయడానికి ఆ మధ్య పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అలాగే రామ్ తళ్లూరి నిర్మాతగా, డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయాలి. ఈ మూవీ ప్రకటన కూడా అధికారికంగా వచ్చేసింది. ఇప్పుడీ 2 సినిమాల్ని పవన్ దాదాపు పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీలో ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. అటువంటప్పుడు అన్ని సినిమాలు తలమీద పెట్టుకుంటే అది కత్తిమీద సాములాగే తయారవుతుంది. ఒకప్పటిలా కాల్షీట్స్ ఇచ్చినా అది సడన్‌గా క్యాన్సిల్ చేసే పరిస్థితుల్లో పవన్ ఉన్నారు. ఇప్పటం ఘటన అదే ప్రూవ్ చేసింది కూడా. హరిహర వీరమల్లు షూటింగ్‌లో ఉన్న పవన్.. ఇప్పటం రోడ్డు విస్తరణ పనుల్లో జరిగిన ఇష‌్యూతో అప్పటికప్పుడు బయలుదేరాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఇప్పటికే తమ పార్టీకి ఎటువంటి నిధులు రాకపోయినా.. సొంత డబ్బులు ప్రజలకు పంచిపెడుతున్నానని పవన్ చెబుతున్నారు. పంట నష్టపోయిన రైతు కుటుంబానికి ఒక్కో లక్ష చొప్పున ఇచ్చిన పవన్.. ఇప్పటంలోనూ కొంతమందికి సొంత డబ్బులే ఇచ్చానని చెప్పారు. నిజానికి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పవన్ ఇంకొక్క సినిమాకు మాత్రమే కాల్షీట్లు కేటాయించే టైమ్ ఉంది. కానీ పవన్.. 2 సినిమాలకు కాల్షీట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సురేందర్ రెడ్డి, సముద్రఖని సినిమాలు.. ఎన్నికల తర్వాత వచ్చే అవకాశం ఉంది తప్ప ఆగిపోయే ప్రసక్తి మాత్రం లేదు. ఎందుకంటే, ఇటు రామ్ తళ్లూరి, అటు టీజీ విశ్వప్రసాద్... ఈ ఇద్దరి అడ్వాన్సులు పవన్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు సినిమాలు పూర్తి చేయాల్సిన పరిస్థితి పవన్‌ది. అయితే పవన్ మెంటాలిటీ బాగా తెలిసిన సన్నిహితులు ఆరునూరైనా పవన్ సినీ, పొలిటికల్ కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తారని అంటున్నారు. 

Tags:    

Similar News