Pawan Kalyan: ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు పండ‌గే.. ఓజీ విడుద‌ల తేదీ కూడా..!

Pawan Kalyan: ప‌వ‌న్ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తుంద‌టే ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2025-05-26 11:43 GMT

Pawan Kalyan: ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు పండ‌గే.. ఓజీ విడుద‌ల తేదీ కూడా..!

Pawan Kalyan: ప‌వ‌న్ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తుంద‌టే ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఉప‌ముఖ్య‌మంత్రిగా గెలిచిన త‌ర్వాత ప‌వ‌న్ బిజీగా మారారు. దీంతో ఆయ‌న సినిమాలై డైలామా నెల‌కొంది. అయితే చేతిలో సినిమాల‌ను త‌ప్ప‌కుండా పూర్తి చేస్తాన‌ని మాటిచ్చిన ప‌వ‌న్ అందుకు అనుగుణంగానే ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తున్నారు.

ఇప్ప‌టికే ‘హరి హర వీరమల్లు’ సినిమాను పూర్తి చేశారు ప‌వ‌న్‌. ఈ సినిమా జూన్ 12న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ఫ్యాన్స్‌కు మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అదే ఓజీ. DVV ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై DVV దానయ్య ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది.

సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి, హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం తాడేపల్లిలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో షూటింగ్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాల మధ్యే షూటింగ్‌కి టైమ్ కేటాయిస్తున్నారు.

కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 25, 2025న విడుదల కానుందని అధికారికంగా వెల్లడించారు. విజయదశమి పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ తేదీని ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సమయంలో వరుస సెలవులు ఉండటం వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమాలో ప‌వ‌న్ ఓజాస్ అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ప‌వ‌న్ మాఫియా లీడ‌ర్ పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌న్న వార్త‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. మ‌రి ఇన్ని అంచ‌నాల న‌డుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి వండ‌ర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 

Tags:    

Similar News