గ్యాప్ వచ్చినా అలీకి ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్ .. 'పింక్' సినిమా కోసమేనా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో బీజీ కానున్నారు. ఆయన వరసగా సినిమాలు చేయడానికి సిద్దమైయ్యారు.

Update: 2020-02-05 15:37 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో బీజీ కానున్నారు. ఆయన వరసగా సినిమాలు చేయడానికి సిద్దమైయ్యారు. 'పింక్' సినిమా తెలుగు రీమేక్ లో పవన్ హీరోగా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ సంబంధించి కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే పవన్ సినిమాల్లో హాస్య నటుడు ఆలీ కచ్చితంగా ఉంటారు. వారీద్దరి మంచి స్నేహితులు కూడా.. ప్రతి సినిమాలో ఆలీ ఉండాలనే పవన్ కోరుకుంటారు.

పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ప్రతి సినిమాలో ఆలీకి చిన్న పాత్రలోనైనా కనిపిస్తారు. రాజకీయాల కారణంగా పవన్ కళ్యాణ్- ఆలీకి మధ్య దూరం పెరిగింది. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన కాదని ఆలీ వైసీపీలో చేరారు. ఆలీకి సినిమాల్లో అవకాశాలు ఇచ్చానని పవన్ విమర్శలు చేశారు.

ఆలీ కూడా అంతే ఘాటుగా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు తాను సినిమాల్లో ఉన్నానని బదులిచ్చారు. దీంతో రాజకీయంగా ఆలీ పవన్ ఒకరిపై ఒకరు తీవ్రస్తాయిలో విమర్శలు కూడా చేసుకున్నారు. రాజకీయాల కారణంగా స్నేహం చెడిపోదని ఆలీ తేల్చిచెప్పారు.

అయితే తాజాగా ఆ నమ్మకంతోనే పవన్ తన స్నేహితుడి ఆలీకి ఫోన్ చేశారు. రాజకీయాలతో ఇరువురి మధ్య పెరిగిన దూరాన్ని పక్కనబెట్టి పవన్ కళ్యాణ్ ఆలీకి ఫోన్ చేశారని వార్తలు వస్తున్నాయి. 'పింక్' రీమేక్‌లో నటించాలని ఆలీని స్వయంగా కోరారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆలీ ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదని టాక్. పవన్ ఆలీకి ఫోన్ చేశారన్న ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ వార్త ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు అంజలి, 'మల్లేశం' చిత్రం ఫేమ్ అనన్య, నివేదా థామస్ ముఖ్య భూమిక పోషిస్తున్నట్లు వార్తలు వస్తు్న్నాయి. ఈ సినిమాకి వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తు్న్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. మే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తు్న్నారు.

  

Tags:    

Similar News