Pawan Kalyan: మెగా హీరోతో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్...
Pawan Kalyan: గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...
Pawan Kalyan: మెగా హీరోతో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్...
Pawan Kalyan: గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "పింక్" సినిమాకి తెలుగు రీమేక్ "వకీల్ సాబ్" సినిమాతో ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చారు. ఈ మధ్యనే మలయాళంలో హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" అనే సినిమా ను తెలుగులో "భీమ్లా నాయక్" గా రీమేక్ చేసి మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో రీమేక్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళంలో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" అనే సినిమా ను ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ "గోపాల గోపాల" అనే ఒక సినిమాలో వెంకటేష్ తో కలిసి నటించారు.
అందులో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో అలరించారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో కనిపించబోతున్నట్టు గా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలవబోతోందట.