పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ న్యూస్.. పింక్ రీమేక్‌ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ !

పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల కొంతకాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు.

Update: 2020-02-27 06:18 GMT
పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ న్యూస్.. పింక్ రీమేక్‌ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ !

పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ కొంత కాలంగా రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల కొంతకాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా వేణు శ్రీరామ్‌ డైరెక్షన్లో పింక్ సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను త్వరలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తుంది. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్‌ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా తమన్ ట్వీట్ చేస్తూ..'పవన్ కళ్యాణ్‌కు అతిపెద్ద ఫాన్‌నైన నేను కూడా #PSPK26FirstSingle రిలీజ్ కోసం ఎదురు చూడలేకపోతున్నాను, #PSPK26 కోసం సినిమా యూనిట్ మొత్తం కష్టపడి పనిచేస్తున్నాం. ఈ సినిమా మాకే కాదు అందరికీ చాలా ముఖ్యం అని ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని బెస్ట్ మ్యూజిక్ అందించేందుకు మా సాయశక్తులా కృషిచేస్తున్నాం అని తెలిపారు. లవ్‌ యూ ఆల్‌ #firstsingle #PSPK26FirstSingle తర్వలో రానుంది అని ట్వీట్ చేశారు. పవన్‌ ఫొటోతో ట్విటర్‌ ప్రొఫైల్‌ చిత్రాన్ని మార్చేశారు.

కాగా.. తమన్‌ ట్వీట్‌ చూసిన పవన్‌ కళ్యాణ్ ఫాన్స్ ఉబ్బితబ్బిపోతున్నారు. అంతే కాదు #PSPK26FirstSingle హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తూ చేస్తున్నారు. దీంతో తమన్ ఇచ్చిన #PSPK26FirstSingle అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ఓ రేంజ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. పవన్ అభిమానులు ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నారు. 

పింక్ చిత్రం బాలీవుడ్‌ స్టార్ హీరో అమితాబ్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు వెంకటేశ్వర ప్రొడక్షన్ హౌస్‌లో బెనర్‌లో నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్‌ స్వరాలు సమకూర్చారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా మొదలైంది. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. 'వకీల్‌సాబ్‌' అనే టైటిల్ ఖారారు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 



 

Tags:    

Similar News