పలాస 1978లో ఏం జరిగింది?

బురదలోకి దిగిపోయాం. కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు సరిపోవే.. ఎప్పుడు ఎవడు ఎల్లిపోయి వచ్చి మా పీక తీసుకెళ్లిపోతాడా?

Update: 2020-03-01 11:35 GMT
palasa Movie trailer out

యువ కథానాయకుడు నటుడిగా..కరుణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పలాస 'పలాస 1978'. యాథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ ప్రముఖ నటుడు రానా విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు చెప్పారు. దయన్‌ అట్లూ సుధాస్ మీడియా పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం సమకూర్చారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి ఆరున ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పింస్తుందనడంలో సందేహం లేదు. ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్ మొదలు కావడంతోనే పలాస 1978లో జరిగిన ఓ హత్య గురించి ఉంటుంది. తర్వాత హీరో రక్షిత్ బురదలోకి దిగిపోయాం. కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు సరిపోవే.. ఎప్పుడు ఎవడు ఎల్లిపోయి వచ్చి మా పీక తీసుకెళ్లిపోతాడా? అని భయంగా ఉందే అంటూ హీరోయిన్ తో చెప్పే డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చెస్తుంది. కరుణ కుమార్ సరసన హీరోయిన్ గా నక్షత్ర నటిస్తుంది. రక్షిత్, రఘుకుంచె పలువురు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

Full View


  

Tags:    

Similar News