OTT Weekend Watch: ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్న టాప్-5 సినిమాలు!

OTT Weekend Watch: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన లేటెస్ట్ మూవీస్ ఈ వీకెండ్ ప్రేక్షకులకు మంచి వినోదం అందించనున్నాయి.

Update: 2025-12-27 02:30 GMT

OTT Weekend Watch: ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్న టాప్-5 సినిమాలు!

OTT Weekend Watch: క్రిస్మస్ వీకెండ్ (డిసెంబర్ 27–28) సందర్భంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కొత్త సినిమాలు, వెబ్ కంటెంట్ సందడి చేయనున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన లేటెస్ట్ మూవీస్ ఈ వీకెండ్ ప్రేక్షకులకు మంచి వినోదం అందించనున్నాయి. ప్రేమకథల నుంచి థ్రిల్లర్, హారర్ వరకు అన్ని జానర్స్‌లో ఈసారి ఎంపికలు ఉన్నాయి. ఈ వీకెండ్ తప్పక చూడాల్సిన టాప్ 5 సినిమాలు ఇవే…

1. ఆంధ్రా కింగ్ తాలూకా — నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో పెద్దగా ఆదరణ దక్కకపోయినా, ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓ హీరో అభిమాని జీవితంలో జరిగే సంఘటనల చుట్టూ తిరిగే కథ ఇది.

2. ఏక్ దీవానే కి దీవానియత్ — జీ5 (హిందీ)

హర్షవర్ధన్ రాణే, సోనమ్ బజ్వా జంటగా నటించిన ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీ జీ5లో అందుబాటులో ఉంది. కొందరు విమర్శించినా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషన్‌గా నిలిచింది.

3. మిడిల్ క్లాస్ — జీ5 (తమిళం)

మునీష్‌కాంత్, విజయలక్ష్మి నటించిన ఈ చిత్రం ఒక మధ్యతరగతి కుటుంబ జీవితాన్ని హృద్యంగా చూపిస్తుంది. అనుకోకుండా దొరికిన ఒక పెద్ద మొత్తం జీవితాన్ని ఎలా మార్చిందన్నదే కథాంశం.

4. ఐ యామ్ గాడ్ — సన్ నెక్ట్స్ (కన్నడ)

కాలేజ్ ప్రేమకథ, సీరియల్ కిల్లర్ మిస్టరీ కలగలిపిన ఈ థ్రిల్లర్ రవి గౌడ దర్శకత్వంలో తెరకెక్కింది. థ్రిల్లర్ అభిమానులకు ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.

5. నిధియుమ్ భూతవుమ్ — సన్ నెక్ట్స్ (మలయాళం)

ఒక పాత భవనంలోకి మారిన ముగ్గురు యువకులు ఎదుర్కొనే భయానక అనుభవాలే ఈ సినిమా కథ. హారర్, కామెడీ మిక్స్‌తో రూపొందిన ఈ మూవీ సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Tags:    

Similar News