OTT Thriller: తలలు కట్ చేసి ఎత్తుకెళ్లే సైకో కిల్లర్ కథ..! ఓటీటీలో హై ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కలకలం

ప్రతి వారం ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు మాంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. వీటి జానర్‌కు ఓ ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. తాజాగా ఓటీటీలో విడుదలైన ఓ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సరికొత్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

Update: 2025-08-01 13:08 GMT

OTT Thriller: తలలు కట్ చేసి ఎత్తుకెళ్లే సైకో కిల్లర్ కథ..! ఓటీటీలో హై ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కలకలం

ప్రతి వారం ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు మాంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. వీటి జానర్‌కు ఓ ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. తాజాగా ఓటీటీలో విడుదలైన ఓ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సరికొత్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది. దానిలో కథనం, ట్రీట్మెంట్, స్క్రీన్‌ప్లే, ట్విస్టులు అన్నీ భయపెట్టే స్థాయిలో ఉండటంతో ప్రేక్షకులు ఫుల్‌గా కనెక్ట్ అవుతున్నారు.

ఈ సిరీస్ కథ పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో ఉన్న ఓ పల్లెటూరులో జరుగుతుంది. బలగఢ్ అనే ఆ ఊరు సాధారణంగా నేరాలకు దూరంగా, ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒక్కరోజు ఓ చిన్న దొంగతనం కేసుతో పాటు ఓ వ్యక్తి మిస్సింగ్ కావడం.. వెంటనే ఒక తలరహిత శవం లభించడం వలనే ఊరిలో పరిస్థితి భయానకంగా మారుతుంది. పోలీసులు విచారణ ప్రారంభిస్తే.. ఊహించని షాకింగ్ రివీల్స్ జరుగుతాయి.

అసలు అమాయకంగా కనిపించే ఓ వ్యక్తి ఈ దారుణ హత్యల వెనక ఉన్నాడు. అతను తన బాధలను బయటపెట్టకుండానే వరుస హత్యలకు పాల్పడతాడు. చివరకు అతన్ని పట్టుకున్నా, విచారణలో ఒక శబ్దం కూడా పలకడు. అయితే అతడు ఎవరు? అతని మిషన్ ఏంటి? అతని వెనుక ఉన్న మానసిక పరిస్థితి ఏమిటన్నదే ఈ సిరీస్ హార్ట్.

ఈ వెబ్ సిరీస్ పేరు బిభీషణ్ (Bibhishan). ఇది బెంగాలీ భాషలో రూపొందిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. IMDb రేటింగ్ 7.1/10 ఉండగా, ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే తెలుగులో డబ్బింగ్ లేదు కానీ తెలుగు సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అయితే మైండ్‌ బ్లాస్టింగ్ అనిపించుకుంటుంది.

సైకో కిల్లర్ థ్రిల్లర్‌లు, ఇంటెన్స్ మర్డర్ మిస్టరీలు ఇష్టపడే వారికి ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది.



Tags:    

Similar News