OTT Movie: భర్తకు తెలియకుండా విలన్ తో గడిపే భార్య.. పిచ్చెక్కించే ట్విస్టులతో అదర గొట్టే మందార

OTT Movie: ఈ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరే మందార్. దీనిలో అనిర్బన్ భట్టాచార్య, ప్రతీక్ దత్తా ఈ సిరీస్ ను తెరకెక్కించారు.

Update: 2025-02-25 06:16 GMT

OTT Movie: మూడొచ్చినప్పుడల్లా పక్కోడి పెళ్లాంతో బంచిక్ చేసే విలన్.. ఆమె అలా చేస్తుందని తెలిసిన హీరో ఏం చేశాడంతే

OTT Movie: ఓటీటీలు వచ్చిన తర్వాత ఎంటర్ టైన్ మెంట్ కు కొదవ లేకుండా పోయింది. ప్రస్తుతం వాటిలో వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. సినిమాలతో పాటు ఈ వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. సస్పెన్స్, క్రైమ్, హారర్ లాంటి స్టోరీలతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే బెంగాలీ వెబ్ సిరీస్ చాలా వెరైటీగా ఉంటుంది. ఇందులో మందార్ అనే రౌడీ చుట్టూ కథ తిరుగుతుంది. ఈ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరే మందార్. దీనిలో అనిర్బన్ భట్టాచార్య, ప్రతీక్ దత్తా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. భట్టాచార్య ఈ సిరీస్ ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ బెంగాలీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళితే.. చాహన్ ఒక గ్రామానికి పెద్ద మనిషిగా వ్యవహరిస్తుంటాడు. ఇతడికి అదే ఊరిలో నివసించే వీర అనే వ్యక్తి ఎదురు తిరుగుతాడు. అతడి దగ్గరే రౌడీగా పని చేసే మందార్ కి విషయం వివరించి వీరాను చంపేయమంటాడు. వీరా కూడా అతనికి ఫ్రెండే కావడంతో మొదట చెప్పి చూస్తాడు. తను మాట వినకపోవడంతో సముద్రంలోకి తీసుకెళ్లి హత్య చేస్తాడు. మందార్ కి లైలా అనే భార్య ఉంటుంది. తను చాహన్ తో ఏకాంతంగా గడుపుతూ ఉంటుంది. ఈ విషయం ముందునుంచే మందార్ కు తెలిసి కూడా సైలంట్ గా ఉంటాడు. యజమానిని ఎదిరించలేక అలానే నిశ్శబ్ధంగా ఉండిపోతాడు. చాహన్ కి మూడ్ వచ్చినప్పుడల్లా మందార్ భార్యతో బంచిక్ చేస్తుంటాడు. మందార్ తో లైలాకు పిల్లలు పుట్టరు. దీంతో చాహన్ తో పిల్లలు కావాలని అడుగుతుంది. అందుకు అతడు ఒప్పుకోడు. దీంతో ఆమె భర్తను నిందిస్తాడు. ఆ తర్వాత చాహన్ భార్య కూడా లైలా దగ్గరికి వచ్చి, నీవల్ల మాకు ఏదైనా జరిగితే చంపేస్తామంటూ బెదిరిస్తుంది..

ఇది విని కోపం తెచ్చుకున్న లైలా తన భర్తతో చాహాన్ ను చంపి ఈ ఊరుకు నువ్వే పెద్ద కావాలని అంటుంది. మందార్ కూడా అందుకు ఒప్పుకుని ఓ ప్లాన్ వేస్తాడు. మందార్ భార్య లైలా దగ్గరికి ఏకాంతంగా గడపడానికి వస్తాడు చాహన్. అదే సమయంలో మందార్ తనను చంపేస్తాడు. ఈ విషయం అదే ఊరిలో ఉన్న ఓ పోలీస్ కు తెలుస్తుంది. అయితే ఊరంతా అతడు ప్రమాదంలో చనిపోయాడని అనుకుంటారు. ఆ పోలీస్ ఆఫీసర్ విషయం తెలుసుకుని మందార్ తో ఓ డీల్ కుదుర్చుకుంటాడు. మందార్ భార్య అందంగా ఉండడంతో ఆమెను చూసి పోలీస్ కూడా పడిపోతాడు. దీంతో పోలీస్ కూడా మందార్ భార్యను తన దగ్గరకి పంపాలని డిమాండ్ చేస్తాడు. మరి మందార్ తన భార్యను పంపిస్తాడా.. పోలీసును కూడా చంపేస్తాడా తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.

Tags:    

Similar News