OTT: ఓటీటీలోకి మరో బోల్డ్‌ కంటెంట్‌ మూవీ.. కంప్లీట్ యూత్‌ ఎంటర్‌టైనర్‌

OTT: తమిళంలో వచ్చిన దాదాపు రెండేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది ఎమోజీ వెబ్‌ సిరీస్‌. బోల్డ్‌ సీన్స్‌, డైలాగ్స్‌తో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.

Update: 2025-02-26 11:30 GMT

OTT: ఓటీటీలోకి మరో బోల్డ్‌ కంటెంట్‌ మూవీ.. కంప్లీట్ యూత్‌ ఎంటర్‌టైనర్‌

OTT Bold Content ‘Emoji’ Web Series Streaming on Aha from February 28

OTT: ఏమంటూ ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చాయో కంటెంట్ తీరు మొత్తం మారిపోయింది. బోల్డ్‌ కంటెంట్ ఎక్కువైపోయింది. సెన్సార్‌ సర్టిఫికేషన్‌తో పనిలేకుండా సినిమాలు ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా మితిమీరిన యాక్షన్‌, రొమాంటిక్‌ సన్నివేశాలతో కూడిన సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. యూత్‌ను టార్గెట్‌ చేసుకొని వస్తున్న ఈ సినిమాలకు మంచి రెస్పాన్స్‌ కూడా వస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి ఓ బోల్డ్‌ వెబ్‌ సిరీస్‌ ఓటీటీ ప్రేక్షకలను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఏంటా సిరీస్‌.? ఎందులో స్ట్రీమింగ్‌ కానుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళంలో వచ్చిన దాదాపు రెండేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది ఎమోజీ వెబ్‌ సిరీస్‌. బోల్డ్‌ సీన్స్‌, డైలాగ్స్‌తో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.

మితిమీరిన బోల్డ్‌ కంటెంట్‌ ఉండడంతో ఈ వెబ్‌ సిరీస్‌ అప్పట్లో నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 28 నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ టీజర్‌ను సైతం విడుదల చేశారు.

టీజర్‌ గమనిస్తే వెబ్‌ సిరీస్‌ బోల్డ్‌ కంటెంట్‌తో ఉండనున్నట్లు స్పష్టమవుతోంది. “లవ్, ఫ్యాషన్, డెస్టినీ.. వాళ్లు మళ్లీ కలుసుకుంటారా. ? ఎమోజీ ఫిబ్రవరి 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్” అంటూ ఈ విషయాన్ని ఆహా తెలిపింది. అమ్మాయి, అబ్బాయి సహజీవనం, విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం అనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ రూపొందించారు. మరి తెలుగు ప్రేక్షకులను ఈ సిరీస్‌ ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.



Tags:    

Similar News