OTT And Theatre Telugu Movies Release This Week: ఈ వారం సినీ లవర్స్‌కి పండగే.. థియేటర్స్‌తో పాటు ఓటీటీల్లో..
OTT And Theatre Telugu Movies Release This Week: ఈ వారం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
OTT And Theatre Telugu Movies Release This Week: ఈ వారం సినీ లవర్స్‌కి పండగే.. థియేటర్స్‌తో పాటు ఓటీటీల్లో..
OTT And Theatre Telugu Movies Release This Week: మరో వారంతం వచ్చేసింది. ఈ వారం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిలో మోస్ట్ అవెయిటెడ్ మూవీ దేవరతో పోటు మరికొన్ని ఆసక్తికర సినిమాలు ఉన్నాయి. మరి ఈ వారం ప్రేక్షలను అలరించేందుకు సిద్ధమవుతోన్న సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేయండి.
కేవలం తారక్ అభిమానులే కాకుండా సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం దేవర. ఎన్టీఆర్ హీరో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. సముద్రం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.
ఇక ఈ వారం థియేటరల్లో సందడి చేస్తున్న మరో చిత్రం మెయ్యజగన్. తమిళంలో ‘96’ వంటి ఫీల్ గుడ్‌మూవీని తెరకెక్కించిన సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుదలకానుంది. పెళ్లి మండపంలో కలుసుకున్న సత్యం, సుందరం అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కథను వినోదాత్మకంగా సి.ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు.
ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు..
* ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న పెద్ద చిత్రం సరిపోదా శనివారం. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 26వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో పెనెలోప్ (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 24, హెవెన్ అండ్ హెల్ (ఇంగ్లీష్) సెప్టెంబరు 26, ది ట్రూ జెంటిల్‌మెన్ (ఇంగ్లీష్) సెప్టెంబరు 26, రెజ్‌బాల్ (హాలీవుడ్) సెప్టెంబరు 27, విల్ అండ్ హార్పర్ (హాలీవుడ్) సెప్టెంబరు 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
* అమెజాన్ ప్రైవ్ వేదికగా స్కూల్ ఫ్రెండ్స్(హిందీ సిరీస్) సెప్టెంబరు 25, నోబడీ వాంట్స్ దిస్ (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 26, స్త్రీ2 (హిందీ) సెప్టెంబరు 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
* డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా.. వాళ (మలయాళం) సెప్టెంబరు 23, 9-1-1 (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 24, గ్రోటీ స్క్వేర్ (హాలీవుడ్) సెప్టెంబరు 26, తాజా ఖబర్2 (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
* జీ5 వేదికగా డిమోంటి కాలనీ2 సందడి చేయనుంది. ఈ నెల 27 నుంచి ‘జీ 5’లో తెలుగు, తమిళ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే లవ్ సితార (హిందీ) సెప్టెంబరు 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.