OTT: దృశ్యాన్ని మించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలోకి వచ్చేస్తోంది.
OTT: దృశ్యాన్ని మించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలోకి వచ్చేస్తోంది.
OTT: దృశ్యాన్ని మించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలోకి వచ్చేస్తోంది.
దృశ్యం చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అచ్చంగా ఇలాంటి సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా.? కథెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
మోహన్‌లాల్ హీరోగా తెరక్కిన తుడరుమ్ ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైంది. తెలుగులో కూడా ఇదే టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, శోభన ప్రధాన పాత్రలు పోషించారు. చిన్న సినిమాగా వచ్చి ఏకంగా రూ. 70 కోట్లను రాబట్టింది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
అయితే ఈ సినిమా ఓటీటీ తేదీ విడుదలను ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మాత్రం ఖరారైంది. ఇప్పటికే మోహన్‌లాల్ నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ హక్కులు పొందిన జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఈ చిత్రాన్ని కూడా స్ట్రీమ్ చేయనుంది. సాధారణంగా మలయాళ సినిమాలు థియేటర్ రిలీజ్ అయిన 4–6 వారాల్లో ఓటీటీలోకి వస్తాయి. ఈ లెక్కన చూస్తే, ఏప్రిల్ 25న విడుదలైన ఈ సినిమా మే చివరలో లేదా జూన్ తొలి వారంలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ‘ఎల్2: ఎంపురాన్’తో పాటు ‘తుడరుమ్’ కూడా హైయెస్ట్-గ్రాసింగ్ మలయాళ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంటుంది.
ఇంతకీ ఈ సినిమా కథేంటంటే.?
‘తుడరుమ్’ ఒక ఫీల్-గుడ్ ఫ్యామిలీ డ్రామాగా మొదలై, క్రమంగా ఎమోషనల్ థ్రిల్లర్‌గా మారుతుంది. ఈ సినిమా కథ కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని రన్ని గ్రామం నేపథ్యంగా సాగుతుంది. షణ్ముఖంను స్థానికులు బెంజ్ (మోహన్‌లాల్) అని పిలుస్తారు. అతడు టాక్సీ డ్రైవర్. తన భార్య లలిత (శోభన), ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తాడు. పాత అంబాసిడర్ మార్క్-1 కారు అంటే షణ్ముఖానికి అమితమైన ప్రేమ.
ఒక రోజు అతని కుమారుడు పవి, స్నేహితులతో ఇంటికి వచ్చి, షణ్ముఖం అనుమతి లేకుండానే తన స్నేహితుడు కిరణ్‌తో కలిసి కారును రైడ్‌కు తీసుకెళ్తాడు. షణ్ముఖం ఓ షాప్‌లో ఉండగా, కారును వెళ్లిపోతుండగా చూసి స్నేహితుడి స్కూటర్‌పై వెంబడిస్తాడు. ఈ క్రమంలో కారు గోడను ఢీకొని కొంత నష్టం జరుగుతుంది. కోపంతో షణ్ముఖం పవిని కొడతాడు. అనంతరం పవి కాలేజీ హాస్టల్‌కు వెళ్లిపోతాడు.
ఇదిలా ఉంటే, షణ్ముఖం యజమాని మరణం కారణంగా మద్రాస్ వెళ్లి తిరిగి వచ్చిన తరువాత, తన కారును పోలీసులు నార్కోటిక్స్ కేసులో స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. కుట్టిచాన్ వర్క్‌షాప్‌లో పనిచేసే మెకానిక్ మణియన్ ఈ కారును డ్రగ్స్ రవాణాకు వాడిన విషయం వెలుగులోకి వస్తుంది. ఇక షణ్ముఖం తన కారును తిరిగి పొందేందుకు చేసే ప్రయత్నాలు, కుటుంబం ఎదుర్కొనే ప్రమాదాలు ఎలా ఉంటాయన్నదే మిగతా కథ. చివరికి షణ్ముఖం తన కారును తిరిగి పొందాడా? కుటుంబాన్ని రక్షించగలిగాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.