Prakash Raj: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసు.. సిట్ విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్
Prakash Raj: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కేసులో సినీనటుడు ప్రకాశ్ రాజ్ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరయ్యారు.
Prakash Raj: బెట్టింగ్ యాప్ కేసు.. సిట్ విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్
Prakash Raj: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కేసులో సినీనటుడు ప్రకాశ్ రాజ్ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరయ్యారు. సీఐడీ కార్యాలయంలో అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ఇదే కేసులో నిన్న నటుడు విజయ్ దేవరకొండను సిట్ ప్రశ్నించింది.
బెట్టింగ్ యాప్‌లకు హీరోయిన్స్, సెలబ్రిటీలు ప్రచారం కల్పించడంతో పలువురు యువకులు వాటికి బానిసలై ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ పలు పీఎస్‌లల్లో కేసులు నమోదవడంతో వాటి విచారణకు సీఐడీ అదనపు డీజీపీ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆయా కేసుల్లో విజయ్‌తోపాటు సినీనటులు రాణా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి సహా మొత్తం 29 మంది నిందితులుగా ఉన్నారు.