మరొకసారి పవన్ కళ్యాణ్ సినిమా కోసం ముందుకొచ్చిన దేవి శ్రీ ప్రసాద్
Devi Sri Prasad: మళ్లీ పవన్ కళ్యాణ్ క్యాంపులో అడుగుపెట్టిన దేవిశ్రీ
మరొకసారి పవన్ కళ్యాణ్ సినిమా కోసం ముందుకొచ్చిన దేవి శ్రీ ప్రసాద్
Devi Sri Prasad: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ సంగీత దర్శకులలో దేవిశ్రీప్రసాద్ కూడా ఒకరు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతాన్ని అందించిన దేవి శ్రీ ప్రసాద్ చేతిలో ఇప్పుడు కూడా చాలానే ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "వాల్తేరు వీరయ్య" సినిమాకి కూడా సంగీతాన్ని అందించిన దేవిశ్రీప్రసాద్ ఇప్పుడు మరొక మెగా హీరో సినిమా కోసం పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్, జల్సా, మరియు అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దేవిశ్రీప్రసాద్ స్వయంగా సంగీతాన్ని అందించారు. అందులో జల్సా మరియు అత్తారింటికి దారేది సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించటం విశేషం. తాజాగా ఇప్పుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తూ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కోసం తమన్ సంగీతాన్ని అందించబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు క్రిష్ దర్శకత్వంలో "హరి హర వీర మల్లు" సినిమాతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాలో కూడా నటించాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా కోసం హరీష్ శంకర్ దేవి శ్రీ ప్రసాద్ రాక్ స్టార్ అనే పాటను విడుదల చేశారు. ఈ టైటిల్ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ మరియు దేవి శ్రీ ల కాంబోలో ఈ సినిమా మరొక మ్యూజికల్ హిట్ అవుతుంది అని మరికొందరు చెబుతున్నారు.