మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి అధికారిక ప్రకటన?

Manchu Manoj: రెండవ పెళ్లి గురించి ప్రకటించనున్న మంచు మనోజ్

Update: 2023-01-18 10:47 GMT

మంచు మనోజ్ రెండవ పెళ్ళి గురించి అధికారిక ప్రకటన?

Manchu Manoj: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ హీరోగా మంచి పేరే తెచ్చుకున్నారు. కానీ గత కొద్ది కాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్న మనోజ్ తాజాగా ఇప్పుడు వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లోకి ఎక్కారు. 2015లో మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్ళైన కొద్ది నెలలకే వారి మధ్య మనస్పర్ధలు రావడంతో వారు విడిపోయారు. 2019లోనే తాము విడాకులు తీసుకుంటున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు మనోజ్.

ఇక తాజాగా ఇప్పుడు మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోడానికి సిద్ధం అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లేట్ టీడీపీ లీడర్ భూమా నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనికని మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే చూస్తూ ఉంటే ఫ్యాన్స్ ఎదురు చూపులకు శుభం కార్డ్ పడబోతున్నట్టు తెలుస్తోంది. "చాలా కాలమైంది కానీ ఈ స్పెషల్ న్యూస్ ను నేను ఎప్పటి నుండో నా మనసులోనే దాచుకున్నాను. నా జీవితం లో మరొక స్టేజ్ కి వెళ్తున్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. దానికి మీ ఆశీస్సులు కూడా కావాలి. జనవరి 20, 2023 న నేను నా జీవితానికి సంబంధించిన ఒక వార్త ను ప్రకటిస్తాను," అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మంచు మనోజ్. ఇక మనోజ్ ప్రకటించ బోయేది తన పెళ్లి గురించి అని ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News