Disco Raja: 'నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో' తెలుగు లిరిక్స్

రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం డిస్కోరాజా.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

Update: 2020-01-27 08:03 GMT

రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం డిస్కోరాజా.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు.

ఇక ఇందులోని "నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో" అంటూ సాగే పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రవితేజ , పాయల్ రాజ్ పుత్ లపై ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటను ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా, ఎస్పీ బాలు ఆలపించారు. ఈ లిరిక్స్ ఇప్పుడు మీకోసం

"నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో

బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో

భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా

స్వరమంటూ లేనీ సంగీతాన్నై నీ మనసునే తాకనా

ఏటు సాగలో అడగని ఈ గాలితో

ఎపుడాగాలో తెలియని వేగాలతో

భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా

స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా

నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో

బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో

భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా

స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా

నీలాల నీ కనుపాపలో ఏ మేఘా సందేశమో

ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే

చిరునామా లేనీ లేఖంటి నా గానం చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి

నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం, తీర్చేశావేమో ఈనాటికి

మౌనరాగాలు పలికే సరాగలతో

మందహసాలు చిలికే పరాగలతో

భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా

స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా

నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో

బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో

నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతూ ఉండగా

నీ తనువులో ఈ పరవశం నను నేను మరిచేంతగా

రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం

రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని, పెంచుదాం

మంచు తెరలన్నీ కరిగించు ఆవిర్లతో

హాయిగా అలిసిపోతున్నా ఆహాలతో

భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా

స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా

నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో

బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో" 


Full View


Tags:    

Similar News