RRR Theatrical Trailer: భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం పదా!
* డిసెంబర్ 9న ఉదయం 11గంటలకు "ఆర్ఆర్ఆర్" సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్
RRR Theatrical Trailer: భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా!
RRR Theatrical Trailer: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తోన్న "ఆర్ఆర్ఆర్" సినిమా ట్రైలర్ డిసెంబర్ 9న ఉదయం 11గంటలకు చిత్ర యూనిట్ విడుదల చేసింది.1920 బ్యాక్‌డ్రాప్‌తో స్వాతంత్రానికి ముందు కథతో తెరకెక్కిన "ఆర్ఆర్ఆర్" చిత్రంలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ కనిపించబోతున్నారు.
అల్లూరి పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ల నటన అభిమానులకు కన్నుల పండుగ అనే చెప్పొచ్చు. "భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం పదా" అంటూ రామ్‌చరణ్ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తోంది. బ్రిటీష్ వారిని వీరిద్దరూ ఎలా ఎదిరించారనేదే కథాంశం. తాజాగా సెన్సార్ ను పూర్తి చేసుకొన్న "ఆర్ఆర్ఆర్" చిత్రం యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల చేస్తున్నారు.