తన భాషా నైపుణ్యంతో షాక్ ఇచ్చిన ఎన్టీఆర్
* లాస్ ఏంజిల్స్ లో తన అమెరికన్ స్లాంగ్ తో అబ్బురపరిచిన ఎన్టీఆర్
తన భాషా నైపుణ్యంతో షాక్ ఇచ్చిన ఎన్టీఆర్
RRR Movie: "ఆర్ఆర్ఆర్" సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను, వారి ప్రేమాభిమానాలను అందుకున్నారు. తారక్ ఎప్పటికప్పుడు తన నటనతో వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటూనే ఉంటారు. తనలో ఉన్న ప్రతిభలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. మలయాళం తప్ప ఆర్ఆర్ఆర్ సినిమాలో తన పాత్రకు అన్ని భాషల్లోనూ తానే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు. ఆఖరికి జపనీస్ వర్షన్ కి కూడా ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చారు.
తాజాగా సినిమా జపాన్ రిలీజ్ సందర్భంగా ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఇచ్చిన జపనీస్ స్పీచ్ కూడా ఇప్పుడు అందరి దృష్టిని బాగా ఆకట్టుకుంటుంది. తారక్ భాషా నైపుణ్యానికి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా లాస్ ఏంజెల్స్ వేదికగా ఎన్టీఆర్ తన భాష నైపుణ్యాన్ని మరొకసారి నిరూపించుకున్నారు. "ఆర్ఆర్ఆర్" సినిమా ఈ మధ్యనే లాస్ ఏంజెల్స్ లోని డీజీఏ థియేటర్లో స్క్రీన్ అయింది.
ఈ షోకి ఎన్టీఆర్, రాజమౌళి కూడా హాజరయ్యారు. ఈ వేదికపై మాట్లాడుతూ ఎన్టీఆర్ తన అమెరికన్ స్లాంగ్ తో అదరగొట్టేశారు. తన యాస తో అమెరికన్ వెస్ట్రన్ ప్రజలను కూడా సర్ప్రైజ్ చేశారు. ఒక తెలుగు నటుడు అమెరికన్ లాంగ్వేజ్ ని అలవోకగా మాట్లాడటం చూసి అక్కడి ప్రజలు కూడా షాక్ అయిపోయారు. మీడియాతో మాట్లాడుతున్నంత సేపు ఎన్టీఆర్ చాలా అద్భుతంగా మాట్లాడారు.