Allu Arjun : ఎన్టీఆర్ అనుకున్నారు.. కానీ బన్నీ వచ్చేసాడు.. మురుగన్ గా ఐకాన్ స్టార్ విశ్వరూపం
Allu Arjun : టాలీవుడ్‌లో హీరో-హీరోయిన్ల పెయిర్ కంటే క్రేజీ కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది స్టార్ హీరో, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ల జోడీనే. అలాంటి ఒక సూపర్ హిట్ జోడీ ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కబోతోంది.
Allu Arjun: టాలీవుడ్‌లో హీరో-హీరోయిన్ల పెయిర్ కంటే క్రేజీ కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది స్టార్ హీరో, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ల జోడీనే. అలాంటి ఒక సూపర్ హిట్ జోడీ ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కబోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నాలుగోసారి జతకట్టబోతున్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే.
నిజానికి 'పుష్ప 2' తర్వాత బన్నీ-త్రివిక్రమ్ సినిమా ఉంటుందని అందరూ ఆశించారు. కానీ మధ్యలో బన్నీ అట్లీకి ఓకే చెప్పడం, త్రివిక్రమ్ వెంకటేష్‌తో ఒక ఫ్యామిలీ మూవీకి సిద్ధమవడంతో ఈ కాంబో లేనట్టే అని అంతా అనుకున్నారు. అంతేకాకుండా త్రివిక్రమ్ తన తదుపరి భారీ చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్‌తో చేస్తారని, దానికి మురుగన్ అని పేరు కూడా పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ తన మనసు మార్చుకుని మళ్ళీ అల్లు అర్జున్ దగ్గరికే వచ్చారట. గతంలో వీరి మధ్య వచ్చిన చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఇప్పుడు సమసిపోయాయని, అందుకే మళ్ళీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయిందని టాక్.
ఈ సినిమా ఒక సాధారణ కమర్షియల్ మూవీ కాదు, ఇదొక భారీ పౌరాణిక గాథ. లార్డ్ ఆఫ్ వార్ గా పిలవబడే యుద్ధ వీరుడు మురుగన్ (కార్తికేయుడు) చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ఈ చిత్రాన్ని ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌తో పాన్-వరల్డ్ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు పౌరాణిక అంశాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తున్న తరుణంలో, త్రివిక్రమ్ కూడా తన మార్కు ఫిలాసఫీని జోడించి ఈ విజువల్ వండర్‌ను సిద్ధం చేస్తున్నారట.
త్రివిక్రమ్ ఇప్పటిదాకా క్లాస్, ఫ్యామిలీ సినిమాలతోనే మెప్పించారు. కానీ ఈ మురుగన్ ప్రాజెక్ట్ ఆయనను పాన్-ఇండియా రేంజ్ డైరెక్టర్‌గా మార్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కి ఇప్పటికే ఉన్న గ్లోబల్ ఇమేజ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ కానుంది. ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. బన్నీ కూడా ఈ పాత్ర కోసం తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకోబోతున్నారని సమాచారం.