Champion Movie Review: ఛాంపియన్ రివ్యూ: బైరాన్‌పల్లి వీరుల పోరాటంలో ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ కథ!
Champion Movie Review: రోషన్ మేకా హీరోగా, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా ‘ఛాంపియన్’. మలయాళ నటి అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం, తెలంగాణలోని బైరాన్‌పల్లి గ్రామ నేపథ్యంగా తెరకెక్కింది.
Champion Movie Review: ఛాంపియన్ రివ్యూ: బైరాన్‌పల్లి వీరుల పోరాటంలో ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ కథ!
Champion Movie Review: రోషన్ మేకా హీరోగా, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా ‘ఛాంపియన్’. మలయాళ నటి అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం, తెలంగాణలోని బైరాన్‌పల్లి గ్రామ నేపథ్యంగా తెరకెక్కింది. సినిమా యూనిట్ గట్టిగా ప్రమోషన్స్ చేయడంతో పాటు పాటలు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో, విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘ఛాంపియన్’ ఎంతవరకు అందుకుంది? ఇప్పుడు రివ్యూలోకి వెళ్దాం.
కథ:
సికింద్రాబాద్‌లోని ఒక బేకరీలో పని చేస్తూ జీవనం సాగించే మైఖేల్ (రోషన్)కి ఇంగ్లాండ్‌లో స్థిరపడాలన్నది పెద్ద కల. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫుట్‌బాల్ తనకు సరైన మార్గమని భావించి, ఫుట్‌బాల్‌లో ఛాంపియన్‌గా నిలవాలని ప్రయత్నిస్తుంటాడు. ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం దగ్గరపడిన సమయంలో, అతని తండ్రి చేసిన ఒక పని అతనికి అడ్డంకిగా మారుతుంది. ఆ క్రమంలోనే తుపాకులు డెలివరీ చేయాల్సిన ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకుంటాడు మైఖేల్.
అనుకోకుండా తుపాకులు ఉన్న ట్రక్కుతో పాటు బైరాన్‌పల్లి గ్రామానికి చేరిన మైఖేల్, అక్కడ ఎదుర్కొన్న పరిణామాలు ఏమిటి? అతను ఆ డెలివరీ పూర్తి చేసి ఇంగ్లాండ్ చేరుకున్నాడా? అతని తండ్రి చేసిన పని ఏంటి? బైరాన్‌పల్లిలో మైఖేల్ చేసిన ప్రయాణం ఎలా ముగిసింది? అన్న ప్రశ్నలకు సమాధానాలే మిగతా కథ.
విశ్లేషణ:
బైరాన్‌పల్లి నేపథ్యంగా సినిమా రూపొందుతోందన్న వార్త నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ప్రమోషన్స్‌తో పాటు పాటలు కూడా బాగా క్లిక్ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. సినిమా ఆరంభంలో నిజాం పాలన, రజాకార్ల నేపథ్యాన్ని సంక్షిప్తంగా చూపిస్తూ కథలోకి తీసుకెళ్లారు. మైఖేల్ క్యారెక్టర్‌ను పరిచయం చేసిన తీరు బాగుంది.
అతని ఇంగ్లాండ్ ప్రయాణం నుంచి బైరాన్‌పల్లి వైపు కథ మలుపు తిరిగే విధానం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, ఫస్ట్ హాఫ్‌లో కొంత ల్యాగ్ అనిపిస్తుంది. బైరాన్‌పల్లిపై రజాకార్ల దాడితో ఇంటర్వెల్ ఇవ్వడం సెకండ్ హాఫ్‌పై క్యూరియాసిటీ పెంచుతుంది. అయితే సెకండ్ హాఫ్ కూడా కొంత వరకు స్లోగా నడిచినా, క్లైమాక్స్‌లో వచ్చే హై మూమెంట్స్ ఆ లోటును కప్పేస్తాయి.
కొన్ని చోట్ల ల్యాగ్ ఉన్నప్పటికీ, దర్శకుడు ప్రదీప్ అద్వైతం ప్రేక్షకులను కథలో ఎంగేజ్ చేయడంలో విజయవంతమయ్యాడు. ఎక్కడా కథ నుంచి డివియేట్ కాకుండా, మనల్ని కూడా బైరాన్‌పల్లి గ్రామంలో ఉన్నట్టే అనిపించేలా ట్రీట్ చేశారు. రజాకార్ల నేపథ్యాన్ని చాలా పకడ్బందీగా హ్యాండిల్ చేయడం ప్రశంసనీయం. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకుని, దాన్ని సీరియస్‌గా తెరకెక్కించిన స్వప్న సినిమాస్ ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే.
నటీనటులు & సాంకేతిక విభాగం:
మైఖేల్ పాత్రలో రోషన్ మేకా పూర్తి స్థాయిలో ఒదిగిపోయాడు. తెలంగాణ యాసలో సంభాషణలు పలుకుతూ, ఆ కాలానికి చెందిన యువకుడిగా న్యాయం చేశాడు. అనస్వర రాజన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది; రోషన్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా వర్క్ అయింది. మరో ప్రధాన ఆకర్షణ నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. ఆయన కనిపించిన ప్రతి సీన్‌లోనూ ఒక మంచి నటుడిని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
రచ్చ రవి, ‘బలగం’ సంజయ్ సహా ఇతర సహాయక నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. టెక్నికల్ టీమ్ పనితీరు ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చేసిన కృషి అద్భుతం. మొత్తం సినిమా సెట్స్‌లోనే తెరకెక్కినప్పటికీ, ఆ కృత్రిమత ఎక్కడా కనిపించదు.
సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. పాటలు బాగా వర్క్ అయ్యాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కథకు బలాన్ని చేకూర్చింది. విజువల్స్ కొత్తగా ఉన్నాయి, ముఖ్యంగా వార్ సన్నివేశాలు బాగా కుదిరాయి. నిడివిని ఇంకొంచెం క్రిస్పీగా కట్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బలంగా ఉన్నాయి. ఇలాంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన స్వప్న సినిమాస్‌ను తప్పకుండా అభినందించాలి.
రేటింగ్: 3.5/5