Allu Arjun : అల్లు అర్జున్ బాక్సాఫీస్ వేట.. వచ్చే మూడేళ్లలో 5 భారీ సినిమాలు

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. పుష్ప సినిమాతో గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ.. తన తదుపరి సినిమాల విషయంలో చాలా పక్కా ప్లానింగ్‌తో ఉన్నాడు.

Update: 2025-12-25 06:30 GMT

Allu Arjun : అల్లు అర్జున్ బాక్సాఫీస్ వేట.. వచ్చే మూడేళ్లలో 5 భారీ సినిమాలు

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. పుష్ప సినిమాతో గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ.. తన తదుపరి సినిమాల విషయంలో చాలా పక్కా ప్లానింగ్‌తో ఉన్నాడు. రాబోయే మూడేళ్లలో ఏకంగా ఐదు భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అటు మాస్, ఇటు గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ బన్నీ సెట్ చేసుకున్న ఆ క్రేజీ ప్రాజెక్టుల వివరాల గురించి ఈ వార్తలో తెలుసుకుందాం.

అట్లీతో రూ. 800 కోట్ల భారీ ప్రాజెక్ట్ (AA22) : కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై సుమారు రూ.800 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. హాలీవుడ్ టెక్నీషియన్ల పర్యవేక్షణలో షూట్ చేయనున్న అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకే హైలైట్ కానుంది. ఇందులో బన్నీని అట్లీ మునుపెన్నడూ చూడని రేంజ్ లో స్టైలిష్‌గా చూపించబోతున్నారు. 2027 వేసవి కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

సందీప్ రెడ్డితో సినిమా : యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన సందీప్ రెడ్డి వంగాతో బన్నీ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరిద్దరి కాంబో ప్రకటన వచ్చినప్పటి నుంచే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సందీప్ ప్రభాస్‌తో స్పిరిట్ చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే 2027 చివరలో లేదా 2028 ఆరంభంలో అల్లు అర్జున్-వంగా మూవీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇది ఒక వైల్డ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది.

ప్రశాంత్ నీల్ మాస్ : మరోవైపు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కూడా బన్నీ కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. హై-వోల్టేజ్ యాక్షన్ ఇష్టపడే వారికి ఈ కాంబో ఒక ఐ-ఫీస్ట్ లాంటిది.

బోయపాటి బాస్ : ఇక సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కూడా బన్నీ మరో మాస్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రానున్న ఈ సినిమా పక్కా లోకల్ మాస్ ఆడియన్స్‌ను ఊపేయడం ఖాయం.

పుష్ప-3.. ది రాంపేజ్ : వీటన్నింటి కంటే ఎక్కువగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది పుష్ప 3 కోసం. పుష్ప-2 తోనే కథ ముగిసిపోదని, పార్ట్-3 కూడా ఉంటుందని ఇప్పటికే చిత్ర బృందం హింట్ ఇచ్చింది. సుకుమార్ విజన్ ప్రకారం.. మూడో భాగంలో పుష్పరాజ్ అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఎలా శాసించాడు అనే కోణంలో కథ సాగనుంది. ఈ సినిమాను 2028 నాటికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి రాబోయే మూడేళ్లు బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ మేనియా నడవబోతోంది.

Tags:    

Similar News