War 2 Teaser: ఇది క‌దా కావాల్సింది.. వార్‌2 టీజ‌ర్ చూస్తే గూజ్‌బంప్స్ రావాల్సిందే

War 2 Teaser: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ పెద్ద సర్ప్రైజ్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి న‌టిస్తున్న‌ హిందీ యాక్షన్ సినిమా 'వార్ 2' నుంచి మంగ‌ళ‌వారం విడుదలైన టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Update: 2025-05-20 07:35 GMT

ఈ టీజర్‌లో ప్రధానంగా ఎన్టీఆర్‌ను ఫోకస్‌ చేస్తూ శక్తివంతమైన యాక్షన్ సీన్స్ చూపించారు. ఎన్టీఆర్ స్టైల్, కిల్లర్ లుక్స్‌తో పాటు హృతిక్ రోషన్ స్టైలిష్ ప్రెజెన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తేనే సినిమా ఎంత గ్రాండ్‌గా, పవర్‌ఫుల్‌గా తెరకెక్కిందో అర్థమవుతోంది.

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలైన ఈ టీజర్‌లో ఎన్టీఆర్ తనే వాయిస్‌ ఓవర్ ఇవ్వ‌డం విశేషం. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. వార్ 2 సినిమా 2025 ఆగస్టు 14న విడుదల కానుంది.

‘ఎన్టీఆర్ - నీల్’ మూవీ అప్డేట్ డిలే

ఇదే సమయంలో ఎన్టీఆర్ నటిస్తున్న మరో భారీ చిత్రం 'ఎన్టీఆర్ - నీల్' నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్, కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది.

Full View

Tags:    

Similar News