Jr NTR: పెద్ద మనసుతో ఈ ధరిత్రిని మరొక్కసారి తాకిపో తాతా.. ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ పోస్ట్

Jr NTR: ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ మనవడు, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, అతని సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు.

Update: 2025-05-28 07:17 GMT

Jr NTR: పెద్ద మనసుతో ఈ ధరిత్రిని మరొక్కసారి తాకిపో తాతా.. ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ పోస్ట్

Jr NTR: తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు గారి 102వ జయంతిని మే 28న ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు కుటుంబ సభ్యులు, అభిమానులు, రాజకీయ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ మనవడు, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, అతని సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పమాలలు సమర్పించి ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు.

కాగా ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదిక Xలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను” అంటూ చేసిన పోస్ట్ ఆయన అభిమానుల మనసులను తాకింది. ఈ పోస్ట్‌పై “జోహార్ ఎన్టీఆర్” అంటూ పలువురు ఎమోషనల్ కామెంట్లు చేస్తున్నారు.



తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ఎన్టీఆర్ గారు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు తరతరాలకు స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు.

Tags:    

Similar News