'చెక్' ప్రీ రిలీజ్ బిజినెస్.. ఈ ఖైదీ బాక్సాఫీస్ కొల్లగొడతాడా?
నితిన్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ చిత్రం ‘చెక్’.
చెక్ మూవీ
నితిన్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ చిత్రం 'చెక్'. ఈ మూవీ ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్, ప్రేక్షకులను ఆకర్షించింది. దేశద్రోహం, ఉగ్రవాదం కేసులో అరెస్టయిన ఒక చెస్ ఛాంపియన్ గా నితిన్ నటించాడు. లాయర్ క్యారెక్టర్ లో రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం బి, సి ఏరియాల్లో పెద్దగా ప్రభావం చూపించలేదని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆ అంచనాలను దాటేసింది.
ఇప్పటికే చెక్' మూవీ థియేట్రికల్ హక్కులు మంచి ధరలకు అమ్ముడుపోయాయి. ఈ సినిమాకు శాటిలైట్ ద్వారా రూ.15 కోట్లతో పాటు డిజిటల్ రైట్స్ ద్వారా నిర్మాతకు మరో రూ.12 కోట్లు వసూలైందట. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు 'చెక్' సినిమాకు 15 కోట్ల రూపాయలు వెచ్చించారని టాక్. నైజాం రైట్స్‌ను వరంగల్ శ్రీను 5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని అంటున్నారు. కాబట్టి, ఈ సినిమా నిర్మాతకు సేఫ్ వెంచర్ కాబోతోంది. నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, సాయి చంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్, సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రల్లో నటించారు. కళ్యాణి మాలిక్ బాణీలు కట్టారు.