మహేశ్ మేనల్లుడు గల్లా అశోక్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ప్రారంబోత్సవాన్ని నవంబర్ 10 న రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. అయితే ఈ సినిమాలో గల్లా అశోక్ తో అడిపాడేందుకు ఇస్మార్ట్ శంకర్ బ్యూటి నిధి అగర్వాల్ రెడీ అయిపొయింది. ఇప్పటికే కథ చర్చలు జరగగా సినిమాని చేసేందుకు నిధి అగర్వాల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రొమాంటిక్ లవ్ బ్యాక్ గ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా పద్మావతి గల్లా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జీబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నరేశ్, సత్య, అర్చనా సౌందర్య ఇతర పాత్రలలో నటిస్తున్నారు.