బాలీవుడ్‌లో మూస ధోరణులు పైన కరణ్ జోహార్ ఫైర్‌: "ఇదంతా గుంపుగా గోవింద" అంటున్న ప్రముఖ దర్శకుడు

బాలీవుడ్‌లో మూస ధోరణులపై కరణ్ జోహార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభిన్న కథలే విజయానికి దారి తీస్తాయని స్పష్టం చేశారు.

Update: 2025-06-12 09:57 GMT

బాలీవుడ్‌లో మూస ధోరణులు పైన కరణ్ జోహార్ ఫైర్‌: "ఇదంతా గుంపుగా గోవింద" అంటున్న ప్రముఖ దర్శకుడు

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత-దర్శకుడు కరణ్ జోహార్ (Karan Johar) ఇండస్ట్రీలో నెలకొన్న ట్రెండ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో దర్శక నిర్మాతలు కొత్తదనం కాకుండా, హిట్ అయిన సినిమాలను కాపీ చేయడంలోనే మునిగిపోతున్నారని విమర్శించారు. "ఇది సినీ సృష్టికి చేటు, ప్రేక్షకుల అభిరుచిని దిగజార్చే విధానం" అని ఆయన అన్నారు.

బాలీవుడ్‌లో తక్కువ క్రియేటివిటీ.. ఒకేలా సినిమాలు?

కరణ్ జోహార్ మాట్లాడుతూ –

"ప్రేక్షకులు ఒక సినిమాను ఆదరిస్తే, వెంటనే అదే తరహాలో మరో పదికి పైగా సినిమాలు వస్తున్నాయి. దీని వల్లే పరిశ్రమలో కొత్తదనం తగ్గిపోతోంది. ‘ఛావా’, ‘స్త్రీ’, ‘పుష్ప’ విజయాల తరువాత అందరూ అదే ఫార్మాట్‌ను అనుసరిస్తున్నారు. అయితే, ఆ సినిమాలు విజయవంతం కావడానికి కారణం – అవి అప్పటివరకు చూళ్లేని కథలు కావడం" అని పేర్కొన్నారు.

"సినిమా వినూత్నంగా ఉంటేనే హిట్"

కరణ్ అభిప్రాయం ప్రకారం, సినిమాలు విజయవంతం కావడానికి ముఖ్య కారణం – వాటి వెనుక ఉన్న విభిన్న కథలు (unique content), దర్శకుల దృక్పథం. ప్రతీ సారి ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటారని, అదే సినిమాలకు మెచ్చే ప్రధాన అంశమని స్పష్టం చేశారు.

"సినిమాటిక్ యూనివర్స్‌లు నాకు అవసరం లేదు"

ఇటీవలి ఇంటర్వ్యూలో సినిమాటిక్ యూనివర్స్‌లపై స్పందించిన కరణ్ జోహార్ మాట్లాడుతూ,

"నాకు సినిమా అన్నదే ఒక యూనివర్స్‌. స్పై యూనివర్స్‌, పోలీస్ యూనివర్స్‌లా ప్రత్యేకంగా సృష్టించాల్సిన అవసరం లేదు. నాకు ముఖ్యమైనది ప్రేక్షకులకు తాజాదనంతో కూడిన కథలు అందించడం మాత్రమే" అని స్పష్టంచేశారు

Tags:    

Similar News