Ban Netflix: సిద్ధార్థ కథ వల్ల నెట్ఫ్లిక్స్ ని బ్యాన్ చేయమంటున్న నెటిజన్లు

Ban Netflix: మణిరత్నం నిర్మించిన "నవరస" వెబ్ సిరీస్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది.

Update: 2021-08-09 08:48 GMT

Ban Netflix: సిద్ధార్థ కథ వల్ల నెట్ఫ్లిక్స్ ని బ్యాన్ చేయమంటున్న నెటిజన్లు

Ban Netflix: మణిరత్నం నిర్మించిన "నవరస" వెబ్ సిరీస్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. టైటిల్ కి తగ్గట్టు గానే తొమ్మిది భావోద్వేగాల చుట్టూ ఈ వెబ్ సిరీస్ తిరుగుతుంది. హాస్యం, శృంగారం, భయానకం, కరుణ, రౌద్రం, కోపం, ధైర్యం, అద్భుతం మరియు బీభత్సం ఇలా ఒక్కో భావోద్వేగం ఆధారంగా ఒక్కో ఎపిసోడ్ ను చిత్రీకరించారు. తొమ్మిది మంది దర్శకులు మరియు తొమ్మిది మంది హీరోలతో ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ మధ్యనే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల నుంచి కొన్ని ఎపిసోడ్లు చాలా బాగున్నాయి. కానీ కొన్ని ఎపిసోడ్లు మాత్రం ఏమాత్రం బాగోలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే భయానకం భావోద్వేగం ఆధారంగా సిద్ధార్థ్ మరియు పార్వతి ముఖ్య పాత్రల్లో నటించిన ఒక్క ఎపిసోడ్ మాత్రం ఇప్పుడు బోలెడు వివాదాలను సృష్టిస్తోంది. ఈ కథలోని కొన్ని సన్నివేశాలు ముస్లింలకు పవిత్ర గ్రంధమైన ఖురాన్ ను అవమానించినట్లు గా ఉందని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ చేస్ అంటూ సోషల్ మీడియాలో బ్యాన్ నెట్ఫ్లిక్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలతో నెట్ఫ్లిక్స్ ను బహిష్కరించాలని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం పై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News