ముంబై డ్రగ్స్ కేసులో హాట్ టాపిక్ అవుతున్న సమీర్ వాంఖడే ఎపిసోడ్

* కేసు నుంచి సమీర్ వాంఖడేను తప్పించిన ఎన్సీబీ * తనను కేసు నుంచి తప్పించలదన్న సమీర్ వాంఖడే

Update: 2021-11-06 11:57 GMT

ముంబై డ్రగ్స్ కేసులో హాట్ టాపిక్ అవుతున్న వాంఖడే ఎపిసోడ్(ఫైల్ ఫోటో)

Mumbai Drugs Case: ముంబై డ్రగ్స్ కేసు నుంచి సమీర్ వాంఖడే ను తప్పించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ కేసు విచారణలో వాంఖడే ఎంట్రీ అయినప్పుడు ఎంత సంచలనం కలిగిందో ఇప్పుడు అతడిని తప్పించడం కూడా అంతే సెన్సేషనల్ అవుతోంది. దీనికి తోడు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు ఇంకాస్త హీట్‌ను పెంచేశాయి.

ఇదంతా ఒకెత్తయితే తాజాగా ఆర్యన్ ఖాన్ కేసులో ఎన్సీబీ సమీర్ వాంఖడే సహకారం తీసుకోనుందనే వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి. మొత్తంగా వాంఖడేను ఎందుకు తప్పించారు? మళ్లీ ఎందుకీ సహకారం సీన్ అన్న ప్రశ్నలే అందరిలోనూ తలెత్తుతున్నాయి.

మరోవైపు ఈ కేసు దర్యాప్తు నుంచి తనను తప్పించడంపై వాంఖడే స్పంధించారు. ఆర్యన్ ఖాన్ కేసు, నవాబ్ మాలిక్ ఆరోపణలను కేంద్ర ఏజెన్సీతో విచారించాలని తానే అభ్యర్థించానన్నారు. అందుకు తగ్గట్టే ఢిల్లీకి చెందిన ప్రత్యేక బృందం ఈ కేసును విచారించనుందని వాంఖడే చెబుతున్నారు.

ఇదే సమయంలో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ కేసుపై కూడా ఎన్సీబీ దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, ముంబయి ఎన్‌సీబీ బృందాలు పరస్పరం సహకరించుకోనున్నాయన్నారు. అలాగే తాను ముంబయి ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్ పదవిలోనే ఉన్నానని. తనను ఆ ఉద్యోగం నుంచి తీసివేయలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇదే సమయంలో సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కౌంటర్లు కంటిన్యూ చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్, ఆ తర్వాత అతడి విడుదలకు భారీగా డబ్బు డిమాండ్ చేశారనే ఆరోపణలకు సంబంధించి సమీర్ దావూద్ వాంఖడేపై సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పుడు కేంద్రరాష్ట్ర స్థాయిల్లో వాంఖడేను విచారించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయన్న నవాబ్ మాలిక్ ఆ రెండు బృందాల్లో వాస్తవాలను ఎవరు వెలుగులోకి తెస్తారో చూడాలన్నారు. అలాగే, వాంఖడే దుర్మార్గపు ప్రైవేట్ ఆర్మీని ఎవరు బయటపెడతారో చూడాలంటూ ట్వీ్ట్ చేశారు. మొత్తానికి వాంఖడే ఎపిసోడ్ లో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకుంటాయో అన్నది హాట్ టాపిక్ అవుతోంది.


Tags:    

Similar News