నాని కొత్త సినిమాకు సూపర్ టైటిల్..
వరుస హిట్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని తన తదుపరి చిత్రాన్ని ప్రటించారు.
వరుస హిట్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని తన తదుపరి చిత్రాన్ని ప్రటించారు. ఇప్పటికే వి అనే సినిమాతో నాని బీజిగా ఉన్నారు. దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ చిత్రాన్ని చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను తన వ్యక్తిగత ట్విటర్ పోస్టు చేశారు. నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో `వి` సినిమాలో నటిస్తున్నారు. ఇది సెట్స్ మీద ఉండగానే తన తదుపరి చిత్ర టైటిట్ రివీల్ చేశారు. ఆదిపినిశెట్టి, నివేదా థామస్ తో కలసి చేసిన నిన్ను కోరి సినిమాతో హిట్ అందించిన శివా నిర్వాణ దర్శకత్వంలోనే టక్ జగదీష్ చేయనున్నారు.
హరీష్ పెద్ది ,సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి "టక్ జగదీష్" అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వచ్చే సంవత్సరం ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో నానికి జంటగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. హీరోయిన్ రీతూవర్మ తోపాటు మరో హీరోయిన్గా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణను గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. సినిమాలో నాని పేరు టక్ జగదీష్, అదే పేరును టైటిల్‌గా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. ఇటీవల గ్యాంగ్ లీడర్ సినిమాతో హిట్ కొట్టిన నాని తాజాగా వి సినిమాలో షుటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. సుధీర్ బాబు, ఈ సినిమాలో నివేదా థామస్, అదితి రావ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని నటిస్తున్న మూడో సినిమా కావడం విశేషం. ఇంద్రగంటి దర్శకత్వంలోనే అష్టచమ్మా సినిమాలో నాని వెండి తెరకు పరిచయమైయ్యారు.
#Nani26 is #TuckJagadish 🎞
— Nani (@NameisNani) December 3, 2019
BOXOFFICE 2020 💥@ShivaNirvana @riturv @aishu_dil @MusicThaman @sahrudayg @harish_peddi @Shine_Screens pic.twitter.com/vJUoFJNgSa