'శ్యామ్ సింగ రాయ్'.. నాని కొత్త మూవీ వైవిధ్యమైన టైటిల్
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని విభిన్నమైన చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు.
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని విభిన్నమైన చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజుల సందర్భంగా తరవాత చిత్రాన్ని ప్రకటించారు. ఆ నాని 27వ సినిమా టైటిల్‌ను సోమవారం విడుదల చేశారు. 'శ్యామ్ సింగ రాయ్' అనే వైవిధ్యమైన టైటిల్‌ను నాని సినిమాకు పెట్టారు. విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ సనిమాకు డైరెక్షన్ వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఒక స్పెషల్ కాన్సెప్ట్ వీడియో ద్వారా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. పాత కాలంలో ఉండే టైప్ మెషీన్‌ను ఈ వీడియోలో వాడుకున్నారు. టైప్ మెషీన్ వాడేప్పుడు వచ్చే సౌండ్‌ను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా తీసుకున్నారు. ఈ సినిమా 'శ్యామ్ సింగ రాయ్' అనే టైటిల్ రాగానే పేపర్ చిరిగి నాని కళ్లు కనిపిస్తాయి. మొత్తం మీద వీడియో, టైటిల్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ఏడాది డిసెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ప్రస్తుతం నాని 'వి' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్నారు. ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది. మరోవైపు టక్ జగదీశ్ అనే చిత్రంలో కూడా నాని చేస్తున్నారు.