ఎంత మంచివాడవురా రిలీజ్ డేట్ ఫిక్స్

కళ్యాణ్ రామ్ పటాస్ చిత్రం తరవాత ఆ స్థాయిలో విజయం చూడలేదు. ఎమ్మెల్యే చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. 118 సినిమా మంచి టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్‌గా హిట్ కాలేకపోయింది. దీంతో కాస్తా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో కళ్యాణ్ రామ్ ఉన్నారు

Update: 2019-11-26 16:27 GMT
Nandamuri Kalyanram Entha manchi vaadavuraa

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా కలిసి నటిస్తున్న చిత్రం ఎంతమంచివాడవురా. ఈ సినిమా షూటింగ్ ముంగించుకొని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రం బృందం నిర్ణయించింది. శతమానం భవతి చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న డైరెక్టర్‌గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆదిత్య మూజిక్ ఇండియా ప్రై.లి నిర్మిస్తుంది.

జనవరి 15న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. పాటలను డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్టు సినిమా యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలోని రెండు పాటలు రామజోగయ్య శాస్త్రి , సిరివెన్నెల ఓ పాటను రాశారు. శ్రీమణి కూడా పాట రాశారు. ఈ చిత్రానికి ఇటివలి కాలంలో తెలుగులో పాపులర్ అయినా మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ దర్శకత్వం వహించారు.

ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ కు విశేష స్పందన వచ్చిందని ఆఖరి షెడ్యూల్‌ కేరళలోని మున్నార్ చిత్రీకరణ జరిపాం, డిసెంబరు 1 నుంచి రీరికార్డింగ్ జరుగుతుందని నిర్మాత ఆదిత్య ఉమేష్ గుప్తా తెలిపారు. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, సుహాసిని, శరత్‌బాబు, వెన్నెల కిషోర్,తనికెళ్ల భరణి పలువురు నటీనటులు నటిస్తున్నట్లు తెలిపారు.

అయితే కళ్యాణ్ రామ్ పటాస్ చిత్రం తరవాత ఆ స్థాయిలో విజయం చూడలేదు. ఎమ్మెల్యే చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. 118 సినిమా మంచి టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్‌గా హిట్ కాలేకపోయింది. దీంతో కాస్తా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో కళ్యాణ్ రామ్ ఉన్నారు. 

Tags:    

Similar News