Nandamuri Balakrishna: ఒక షో కి రెండు రెండున్నర కోట్లు తీసుకున్న బాలకృష్ణ
Nandamuri Balakrishna: ఈ షో సూపర్ హిట్ అవడానికి గల ముఖ్య కారణం బాలకృష్ణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు...
Nandamuri Balakrishna: ఒక షో కి రెండు రెండున్నర కోట్లు తీసుకున్న బాలకృష్ణ
Nandamuri Balakrishna: తెలుగు లో చాలానే సెలబ్రిటీ టాక్ షో లు ఉన్నాయి కానీ అన్నిటికంటే ప్రస్తుతం బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న "అన్స్తాపబుల్" మాత్రం విపరీతంగా హిట్టయింది. అయితే ఈ షో సూపర్ హిట్ అవడానికి గల ముఖ్య కారణం బాలకృష్ణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడూ సీరియస్ గా కనిపించే బాలకృష్ణ షోలో మాత్రం చాలా సరదా సరదాగా సెలబ్రిటీలను ఆటపట్టిస్తూ ఈగో అన్నది లేకుండా తన ఫన్ సైడ్ తో అందరినీ అలరించారు. ఆహా లో స్ట్రీమ్ అయిన ఈ షో బాగానే పాపులర్ అయింది.
తాజాగా ఆ సంస్థ వారు ఈ షోకి రెండవ సీజన్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి సీజన్కు బాలకృష్ణ కి కేవలం 25 లక్షలు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. ఎపిసోడ్ కి 25 లక్షలు చొప్పున సీజన్ మొత్తానికి కలిపి రెండున్నర కోట్లు ఇచ్చారట. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి రెండో సీజన్ కి బాలకృష్ణ రెమ్యూనరేషన్ కూడా డబల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమానికి క్రియేటివ్ హెడ్ గా బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్విని పేరు వేశారు. త్వరలోనే ఆమెను ఇండస్ట్రీలోకి పరిచయం చేసే అవకాశం ఉందేమో అని అభిమానులు చర్చించుకుంటున్నారు.