Akhanda Movie Updates: బాలయ్య అఖండ మూవీ సంచలనం
Akhanda Movie Updates: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ టీజర్ సంచలనాలు రేపుతుంది.
Akhanda Movie Updates:(File Image)
Akhanda Movie Updates: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'అఖండ' టీజర్ సంచలనాలు రేపుతుంది. తాజాగా 40 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ సినిమా దెబ్బకు పాత రికార్డులు కూడా చెదిరిపోతున్నాయి. ఉగాది పర్వధినాన్ని పురస్కరించుకొని బాలయ్య సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ఈ మేరకు టీజర్ ను విడుదల చేశారు. గత సినిమాల మాదిరిగానే ఈసినిమాకు కూడా 'అఖండ' అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఎంచుకున్నాడు బోయపాటి. ఇక ఈసినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర. ఇక ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. బాలయ్యకు జోడీగా కంచె బ్యూటీ ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
బిబి3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు బిబి 3 టైటిల్ తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరో వైపు బోయపాటి కూడా ఫ్యాన్స్ అంచనాలకు ఎక్కడ తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై 'బీబీ3' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న చిత్రానికి తమన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 28 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.