Nagarjuna: ప్రవీణ్ సత్తారు - నాగార్జున కాంబో మూవీ ఆగినట్లేనా?

Nagarjuna: ఇటీవల విడుదలైన నాగార్జున 'వైల్డ్ డాగ్' సినిమా.. థియేటర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

Update: 2021-04-28 16:10 GMT

నాగార్జున, ప్రవీణ్ సత్తారు (ఫొటో ట్విట్టర్)

Nagarjuna: ఇటీవల విడుదలైన నాగార్జున 'వైల్డ్ డాగ్' సినిమా.. థియేటర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అయితే ఆసక్తికరంగా ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై అద్భుతమైన స్పందనను అందుకుంటోంది.

మరోవైపు, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున తన రాబోయే యాక్షన్ థ్రిల్లర్ కోసం పని చేస్తున్నారు. కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం, నాగార్జున ఈ చిత్రాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆలోచిస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. వైల్డ్ డాగ్ సినిమా బాక్సాఫీస్ ఫలితాన్ని చూసిన నాగార్జున.. తరువాత ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి సిద్ధంగా లేడని తెలుస్తోంది.

అలాగే, ప్రవీణ సత్తారు ఇటీవల తమన్నాతో తీసిన '11 వ అవర్ 'వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకున్నాడు. దీంతో నాగార్జున దర్శకుడు ప్రవీణ్ సత్తారు సినిమా తీసేందుకు పునరాలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రస్తుతానికి ఈ సినిమాను నిలిపేశాడని తెలుస్తోంది.

అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. జూన్ లేదా జూలైలో 'బంగార్రాజు' షూటింగ్ ప్రారంభిస్తానని నాగార్జున ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News