Bigg Boss: కిచ్చా సుదీప్ స్టైల్లో బిగ్ బాస్ హోస్ట్ చేయనున్న నాగార్జున? ఈసారి కంటెస్టెంట్లకు చుక్కలేనా?

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ మళ్ళీ మొదలైంది. హిందీలో కొత్త సీజన్ ఇప్పటికే ప్రారంభం కాగా, తెలుగులో బిగ్ బాస్ 9వ సీజన్ సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది.

Update: 2025-09-07 09:50 GMT

Bigg Boss: కిచ్చా సుదీప్ స్టైల్లో బిగ్ బాస్ హోస్ట్ చేయనున్న నాగార్జున? ఈసారి కంటెస్టెంట్లకు చుక్కలేనా?

Bigg Boss:  బిగ్ బాస్ సీజన్ మళ్ళీ మొదలైంది. హిందీలో కొత్త సీజన్ ఇప్పటికే ప్రారంభం కాగా, తెలుగులో బిగ్ బాస్ 9వ సీజన్ సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. ఈసారి కూడా మన కింగ్ నాగార్జున గారు షోను హోస్ట్ చేయనున్నారు. అయితే ఈసారి ఆయన స్టైల్ లో భారీ మార్పులు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్ స్టైల్ లో, ఈసారి నాగార్జున చాలా కఠినంగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.

నాగార్జున స్టైల్ లో కొత్త మార్పులు?

కిచ్చా సుదీప్ బిగ్ బాస్ షోను హోస్ట్ చేసే విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆయన ఇంటి సభ్యులతో ప్రేమగా వ్యవహరిస్తూనే, తప్పు చేస్తే మాత్రం దయ లేకుండా క్లాస్ పీకుతారు. కఠినమైన మాటలతో హెచ్చరిస్తారు. గత సీజన్లలో నాగార్జున కొంచెం స్మూత్‎గా ఉన్నారని, కఠినంగా వ్యవహరించలేదని కొంతమంది విమర్శించారు. అయితే, ఈసారి అలా కాకుండా, ఇంటి నియమాలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా క్లాస్ తీసుకుంటారని, షోలో మరింత ఉత్సాహం ఉండేలా చూస్తారని తెలుగు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

డబుల్ హౌస్, డబుల్ ఎంటర్టైన్మెంట్

ఈసారి బిగ్ బాస్ హౌస్ రణరంగం థీమ్ తో సిద్ధమైంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి డబుల్ హౌస్ ఫార్మాట్ తీసుకువచ్చారు. అంటే, ఇంటిలో రెండు వేర్వేరు హౌస్‎లు ఉంటాయి. ఒక హౌస్ లో సెలబ్రిటీలు, మరొక హౌస్ లో కామనర్ కంటెస్టెంట్స్ ఉంటారని సమాచారం. ఈ కొత్త ఫార్మాట్ తో ఈ సీజన్ మరింత రసవత్తరంగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు.

కంటెస్టెంట్లు వీరేనా?

బిగ్ బాస్ 9 హౌస్ లోకి వెళ్లనున్న కంటెస్టెంట్ల లిస్ట్ లీక్ అయిందని సమాచారం. వీరిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, హర్షిత్ రెడ్డి, సుమన్ శెట్టి, ఆశా సైనీ, తనుజ గౌడ వంటి సెలబ్రిటీలు ఉన్నారు. ఈసారి షోలో కామనర్లకు కూడా అవకాశం కల్పించారు. దీనికోసం ప్రత్యేకంగా అగ్నిపరీక్ష అనే ప్రీ-షోను నిర్వహించారు. ఈ ప్రీ-షో ద్వారా ఎంపికైన కొందరు కామనర్లు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారు.

Tags:    

Similar News