Lakshya Movie Review: నాగశౌర్య "లక్ష్య" మూవీ రివ్యూ

Lakshya Movie Review: నాగశౌర్య "లక్ష్య" మూవీ రివ్యూ

Update: 2021-12-10 10:32 GMT

నాగశౌర్య "లక్ష్య" మూవీ రివ్యూ (ఫైల్ ఫోటో)

Lakshya Movie Review: ఈ మధ్యనే "వరుడు కావలెను" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఒక లైట్ హార్టెడ్ రొమాంటిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి ఆదరణ అందుకుంది. ఇక తాజాగా "లక్ష" అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు నాగశౌర్య.

ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్లు మరియు ట్రైలర్ లో సిక్స్ ప్యాక్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. స్పోర్ట్స్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఫేమ్ బ్యూటీ కేతికశర్మ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 10 2021 విడుదలైంది. 

చిత్రం: లక్ష్య

నటీనటులు: నాగ శౌర్య, కేతీక శర్మ, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, సత్య, రవి ప్రకాష్, తదితరులు

సంగీతం: కాల భైరవ

సినిమాటోగ్రఫీ: రామ్

నిర్మాతలు: నారాయణ్ దాస్ నారాంగ్, పూస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మారార్

దర్శకత్వం: ధీరెంద్ర సంతోష్ జాగర్లపూడి

బ్యానర్: శ్రీ వేంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్

విడుదల తేది: 10/12/2021

కథ:

పార్ధు (నాగశౌర్య) అప్పుడప్పుడే విలువిద్య నేర్చుకుంటూ ఉంటాడు కానీ ఈ సంవత్సరంలోనే ఒక నేషనల్ ఛాంపియన్ ని ఓడిస్తాడు. అతని ప్రతిభ చూసి బాగా ఇంప్రెస్ అయిన ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ తనని క్వాలిఫైయర్స్ స్లో పాల్గొనమని కోరుతుంది. కానీ తన చేతిలో ఓడిపోయిన ఒకప్పటి నేషనల్ ఛాంపియన్ రాహుల్ పార్ధుని సేడేటివ్ కి అడిక్ట్ చేసి అతనిపై దాడి కూడా చేస్తాడు. దీంతో పార్ధు కుడిచేయి అరచేయి పూర్తిగా డామేజ్ అవుతుంది. కానీ విలువిద్య ని వదులుకోవడం ఇష్టం లేని పార్ధు మళ్లీ తన కెరియర్లోనూ, జీవితంలోనూ గెలవడానికి ఏం చేసాడు? అనేది మిగతా సినిమా కథ.

నటీనటులు:

తన పాత్ర కోసం నాగశౌర్య చాలా కష్ట పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సిక్స్ ప్యాక్ లుక్ తో నాగశౌర్య చాలా బాగా ఆకట్టుకున్నాడు. విలువిద్య లో కూడా ప్రావీణ్యం పొందిన నాగ శౌర్య తన నటనతో పూర్తిస్థాయిలో మెప్పించాడు. సినిమా మొత్తాన్ని నాగశౌర్య ఒక్కడే తన భుజాలపై మోసినట్లు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ కేతికశర్మ తన పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించింది. నాగ శౌర్యతో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. విలన్ పాత్రలో చేసిన నటుడు కూడా తన పర్ఫామెన్స్ చాలా బాగా ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతికవర్గం:

దర్శకుడు ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి ఈ సినిమా కోసం స్పోర్ట్స్ మీద బాగానే రీసెర్చ్ చేసినట్లు అనిపిస్తుంది. ఎంత స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అయినా సరే కథను కొంచెం ఆసక్తికరంగానే మార్చి ఉండచ్చు దర్శకుడు. కథ ఆసక్తికరంగానే మొదలైనప్పటికీ సెకండాఫ్ మాత్రం చాలా స్లో గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఒకటి రెండు పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఒక డ్యూయెట్ చాలా బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఈ సినిమాకి మంచి విజువల్స్ ను అందించారు ఛాయాగ్రహకుడు. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

విలువిద్య బ్యాక్ డ్రాప్ నటీనటులు నిర్మాణ విలువలు

బలహీనతలు:

కథ ప్రెడిక్టబుల్ గా ఉండడం సెకండ్ హాఫ్ బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడం

చివరి మాట:

ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్మూత్ గా జరిగిపోతూ ఉంటుంది. మొదటి మ్యాచ్ లోనే హీరో పాత్ర నేషనల్ ఛాంపియన్ గా మారిపోవడం, తన చేతిలో ఓడిపోయిన అతను విలన్ గా మారి హీరో పై పగ తీర్చుకోవాలి అనుకోవటం ఇదంతా చాలా పాత కాన్సెప్ట్. కథలో అంతగా కొత్తదనం లేకపోవడం కొంచెం నిరాశ కలిగిస్తుంది. హీరో మరియు వాళ్ల తాతయ్య కి మధ్య ఉండే అనుబంధం చాలా బాగా చూపించారు కానీ వాళ్ళ తాతగారు చనిపోయిన తర్వాత పార్ధు జగపతిబాబు పాత్ర వద్దకి వచ్చాక సినిమా గ్రాఫ్ పడిపోయినట్లు అనిపిస్తుంది. కథ చాలా వరకు కదా చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా అప్పుడప్పుడే విలువిద్య నేర్చుకుంటున్నా హీరో పాత్ర సంవత్సరంలోనే ఛాంపియన్ అయ్యేంత గొప్పగా మారటం కొంచెం నమ్మశక్యంగా అనిపించదు.

బాటమ్ లైన్: "లక్ష్య" అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది.

Tags:    

Similar News