Naga Chaitanya: నాగ చైత‌న్య ఫ‌స్ట్ కిస్ ఎవ‌రికో తెలుసా.? వామ్మో చై మాములోడు కాదుగా

Naga Chaitanya: అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లో మంచి జోష్‌లో ఉన్నారు. ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపిస్తూ, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Update: 2025-05-26 10:40 GMT

Naga Chaitanya: నాగ చైత‌న్య ఫ‌స్ట్ కిస్ ఎవ‌రికో తెలుసా.? వామ్మో చై మాములోడు కాదుగా

Naga Chaitanya: అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లో మంచి జోష్‌లో ఉన్నారు. ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపిస్తూ, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా తండేల్ అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించి మంచి విజయాన్ని అందుకున్నారు.

ఇదిలా ఉంటే కేవ‌లం సినిమాల‌తోనే కాకుండా వ్య‌క్తిగ‌త జీవితంలో స‌మ‌స్య‌ల కార‌ణంగా కూడా చైత‌న్య వార్తల్లో నిలిచారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడి, వివాహం చేసుకున్నాడు. కానీ ఆ బంధం ఎక్కువ‌కాలం నిల‌వ‌లేదు. తాము విడిపోయిన విషయాన్ని సమంత స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఆ తర్వాత ఇద్దరూ తమ కెరీర్లపై దృష్టి సారించి బిజీ అయ్యారు.

విడాకుల తర్వాత చైతూ జీవితంలోకి శోభిత వ‌చ్చింది. మొదట ఈ జంట తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ, ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా చైతన్య తన వ్యక్తిగత జీవితంలోని ఓ మధుర జ్ఞాపకాన్ని పంచుకున్నారు. హీరో రానా నిర్వహించిన టాక్ షోలో పాల్గొన్న చైతూ, ఆసక్తికర విషయాలు తెలిపారు. "నీ తొలి ముద్దు ఎప్పుడయ్యింది? ఎవరికిచ్చావు?" అన్న ప్ర‌శ్న‌కు చైతూ బ‌దులిస్తూ.. “తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి తొలిసారి ముద్దిచ్చాను. ఆ ముద్దు జీవితాంతం గుర్తుండిపోయింది,” అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News