Mythri Movie Makers With Chirranjeevi : మైత్రి మూవీ సంస్థతో చిరు.. దర్శకుడు ఎవరంటే?
Mythri Movie Makers With Chirranjeevi : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమాకి
chiranjeevi
Mythri Movie Makers With Chirranjeevi : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.. ఈ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్మాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇందులో చరణ్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది చూడాలి మరి.
ఇక ఈ సినిమాతో తర్వాత చేయబోయే కొన్ని ప్రాజెక్టుల గురించి మెగాస్టార్ ఇటీవలే హింట్ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో కొన్ని కథలను విన్న చిరు ఒకే చెప్పారని సమాచారం.. అందులో భాగంగానే లూసిఫర్ రీమేక్ ని యంగ్ డైరెక్టర్ బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ నిర్మిస్తోంది. అయితే ఈ చిత్ర నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా భాగం అయినట్టుగా తెలుస్తోంది. ఇది మలయాళ సినిమాకి రీమేక్.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పట్టాలేక్కనుంది.