Chiranjeevi Reject Charan : 'సైరా'లో షేర్‌ఖాన్‌ గా చరణ్.. చిరు అందుకే వద్దన్నారట!

Chiranjeevi Reject Charan : ఒక సినిమాని చేసేముందు దర్శకనిర్మాతలు చాలా అనుకుంటారు.. అందులో కొన్ని స్క్రిప్ట్ దశలోనే మెరుగులు దిద్దుకుంటే మరికొన్ని

Krishna
Published on: 23 Aug 2020 10:28 AM IST
Chiranjeevi Reject Charan : సైరాలో షేర్‌ఖాన్‌ గా చరణ్.. చిరు అందుకే వద్దన్నారట!
X

Chiranjeevi and Charan

Chiranjeevi Reject Charan : ఒక సినిమాని చేసేముందు దర్శకనిర్మాతలు చాలా అనుకుంటారు.. అందులో కొన్ని స్క్రిప్ట్ దశలోనే మెరుగులు దిద్దుకుంటే మరికొన్ని మాత్రం చిత్రీకరణ దశలో మెరుగులు దిద్దుకుంటాయి.. ఇక ఇలాంటివి స్టార్ హీరోల సినిమాలో అయితే చాలానే అని చెప్పాలి.. సరిగ్గా మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.. సినిమాలో భాగంగా వచ్చే ఇంటర్వెల్‌ బ్యాక్‌డ్రాప్‌ కోసం షేర్‌ఖాన్‌ అనే పాత్రను సృష్టించింరట రచయితలు.. కేవలం ఇదు నిమిషాల పాత్ర మాత్రమే ఇది ఉంటుందట.. అయితే ఆ పాత్ర ఇంటర్వెల్‌ ముందు వచ్చి ''నరసింహారెడ్డి, నీ లాంటివాడు దేశానికి కావాలి' అంటూ నరసింహ రెడ్డి చేతిలోని కత్తి తీసుకుని పొడుచుకుని చనిపోతుందట..

దీనిని ముందుగా బాలీవుడ్ స్టార్స్ సల్మాన్‌ఖాన్‌, సంజయ్‌ దత్‌ లలో ఎవరిలో ఒకరితో అయిన చేయించాలని అనుకున్నారట.. కానీ వారి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో దానిని వదులుకున్నారట.. దీనితో ఒకనొక దశలో చిరు తనయుడు చరణ్ తో చేయించాలని కూడా భావించారట.. కానీ తండ్రి కారణంగా కొడుకు చనిపోయే సన్నివేశాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో లేదో అని సందేహపడి ఆ పాత్రను చరణ్‌తో చేయించడానికి చిరు ఒప్పుకోలేదట.. దీనితో షేర్‌ఖాన్‌ అనే పాత్రకి స్క్రిప్ట్‌ దశలోనే కత్తెరకు పని చెప్పారట..

ఇక ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్మాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇందులో చరణ్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది చూడాలి మరి.

Krishna

Krishna

Next Story