Acharaya First Look : మెగాస్టార్ 'ఆచార్య' సప్రైజ్ వచ్చేసింది!

Acharaya First Look : ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 'ఆచార్య' మూవీ సప్రైజ్ రానే వచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా

Krishna
Published on: 22 Aug 2020 4:21 PM IST
Acharaya First Look : మెగాస్టార్ ఆచార్య సప్రైజ్ వచ్చేసింది!
X

Megastar Chiranjeevi Acharaya Movie First Look Released 

Acharaya First Look : ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 'ఆచార్య' మూవీ సప్రైజ్ రానే వచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటుగా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం.. సరిగ్గా నిమిషం ఉన్న ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మోషన్ పోస్టర్ లో 'ధర్మస్థలి' అనే గ్రామాన్ని చూపించారు మేకర్స్.. చూస్తుంటే కథలో కీలమైన ఘట్టం ఈ గ్రామం చూట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఇందులో చిరు రెండు విభిన్నమైన పాత్రాల్లో నటించనున్నారు..

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్మాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపుగా యాబై శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది.. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.


Krishna

Krishna

Next Story