Manchu Manoj: నా పోరాటం ఆస్తి కోసం కాదు.. ఆత్మగౌరవం కోసం
Manchu Manoj: తాను ఆస్తి కోసం, డబ్బు కోసం పోరాటం చేయడం లేదని మంచు మనోజ్ చెప్పారు.
Manchu Manoj: నా పోరాటం ఆస్తి కోసం కాదు.. ఆత్మగౌరవం కోసం
Manchu Manoj: తాను ఆస్తి కోసం, డబ్బు కోసం పోరాటం చేయడం లేదని మంచు మనోజ్ చెప్పారు. తాను ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాని ఆయన అన్నారు. తనను రక్షించేందుకు ఉన్న బౌన్సర్లను పోలీసులు పంపించారని ఆయన ఆరోపించారు.ఎదుటి వాళ్ల కోసం వచ్చిన బౌన్సర్లను పోలీసులు ఎందుకు పంపించలేదో చెప్పాలన్నారు.
పోలీసులు ఏకపక్షంగా ఎందుకువ్యవహరిస్తున్నారన్నారు. తన భార్య, తన ఏడు నెలల పాపను కూడా ఇందులో ఇన్ వాల్వ్ చేశారని ఆయన అన్నారు.తనను తొక్కేయడానికి భార్య పిల్లల అంశాన్ని తెస్తున్నారని ఆయన చెప్పారు. తమ ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో రక్షణ కల్పించాలని పోలీసులను అడిగాను... అన్ని విధాలా రక్షణ కల్పిస్తామన్న పోలీసులే పారిపోయారని ఆయన అన్నారు.తన భార్యా పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని.. అందుకే తాను పోరాటం చేస్తున్నానని ఆయన చెప్పారు. న్యాయం కోసం తాను అందరిని కలుస్తానని ఆయన చెప్పారు.