Anil Ravipudi: బాలకృష్ణ కోసం కొత్తగా ఆలోచిస్తున్న అనిల్ రావిపూడి
Anil Ravipudi - Nandamuri Balakrishna: వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి..
Anil Ravipudi-Nandamuri Balakrishna: బాలకృష్ణ కోసం కొత్తగా ఆలోచిస్తున్న అనిల్ రావిపూడి
Anil Ravipudi - Nandamuri Balakrishna: వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా 'ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్' సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కనున్న "ఎఫ్ 3" సినిమా తో బిజీగా ఉన్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా మరియు మెహరీన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. అయితే తాజాగా అనిల్ రావిపూడి, నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం "అఖండ" సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య గోపిచంద్ మలినేని తో కూడా సినిమా పూర్తయ్యాక అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం ఒక పాపులర్ సంగీత దర్శకుడు ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అందరూ దర్శకుల లాగా థమన్ మరియు దేవిశ్రీప్రసాద్ కాకుండా అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం వేరే సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. "అర్జున్ సురవరం", "నోటా", "మోసగాళ్లు" వంటి సినిమాలకు మంచి పాటలను అందించిన శామ్ సీ ఎస్ ఇప్పుడు ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాలో కూడా అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోందని సమాచారం.