Bellamkonda Suresh:సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కారులో చోరీ..
Bellamkonda Suresh కారు అద్దాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డ దుండగులు
Bellamkonda Suresh:సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కారులో చోరీ..
Bellamkonda Suresh: సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కారులో చోరీ జరిగింది. కారు అద్ద పగులగొట్టి కొంత నగదు, ఖరీదైన మద్యం సీసాలను దొంగలు ఎత్తుకెళ్లారు. జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని బెల్లంకొండ సురేశ్‌కు సాయిగణేష్ ప్రొడక్షన్స్ పేరుతో కార్యాలయం ఉంది. నిన్న మధ్యాహ్నం సురేశ్ తన బెంజ్ కారును ఆఫీస్ ముందు నిలిపారు. ఇవాళ ఉదయం చూడగా కారు ఎడమవైపు వెనుక సీటువద్ద అద్దం పగిలి ఉంది. లోపల ఉంచిన 50వేల నగదు, 11 ఖరీదైన మద్యం సీసాలు కనిపించలేదు. ఒక్కో మద్యం సీసా ఖరీదు దాదాపు 28వేలు ఉంటుందని సురేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్సై రాజశేఖర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని, సీసీ కెమెరాలను పరిశీలించారు. ఘటనపై సురేష్ సతీమణి పద్మావతి ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.