Most Eligible Bachelor New poster: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' పోస్టర్ విడుదల

Most Eligible Bachelor New poster: అఖిల్‌, పూజా హెగ్డే జంటగా 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై 'బన్నీ' వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు.

Update: 2020-07-29 15:18 GMT
most eligible bachelor movie romantic poster

Most Eligible Bachelor New poster: అఖిల్‌, పూజా హెగ్డే జంటగా 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై 'బన్నీ' వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన అఖిల్ ఫస్ట్ లుక్, హీరోయిన్ పూజా హేగ్దే లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఫస్ట్ లిరికల్ 'మనసా మనసా' అంటూ సిద్ శ్రీరామ్ ఆలపించిన సాంగ్ విశేష ఆదరణ పొందాయి. తాజాగా ఈ సినిమాలో ఒక పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే… తన కాళ్ళతో అఖిల్ చెవులను టచ్ చేస్తూ ఉంటుంది.

ఈ పోస్టర్ విడుదల అయిన కాసేపటికే ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేసే అవకాశం ఉంది. కానీ ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో విడుద‌ల చేయటానికి నిర్మాతలు స‌న్నాహ‌లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అఖిల్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. 


Tags:    

Similar News