Akhil Akkineni: మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

Akhil Akkineni: మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
x
Highlights

అక్కినేని అఖిల్, పూజా హేగ్దే హీరో హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'... బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై 'బన్నీ' వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

అక్కినేని అఖిల్, పూజా హేగ్దే హీరో హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'... బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై 'బన్నీ' వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన అఖిల్ , పూజా ఫస్ట్ లుక్ లని విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాలోని తొలిపాటను రిలీజ్ చేశారు.

'మనసా..మనసా.. మనసారా బ్రతిలాడా.. తనవలలో పడబోకే మనసా' అంటూ సాగే ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్‌ అందించగా, ప్రముఖ గాయకుడు సిద్‌ శ్రీరామ్‌ ఆలపించాడు. గోపి సుందర్‌ సంగీతం అందిస్తున్నారు. లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.

అఖిల్, హలో, మజ్ను సినిమాలతో నిరాశపరిచిన అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇక జీఏ2 పిక్చర్స్‌ పై సినిమా వస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు మొదలయ్యియి.. చూడాలి మరి ఈ సినిమా అఖిల్ కి ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories