మంచువారి ఇంట్లో మంటలు.. ఒకరిపైఒకరు ఫిర్యాదు చేసుకున్న తండ్రీకొడుకులు
Manchu Manoj vs Mohan Babu: ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
మంచువారి ఇంట్లో మంటలు.. ఒకరిపైఒకరు ఫిర్యాదు చేసుకున్న తండ్రీకొడుకులు
Manchu Manoj vs Mohan Babu: ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మోహన్‌బాబుపై మంచు మనోజ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. తనపై మోహన్ బాబు దాడి చేశాడని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
గాయాలతోనే పోలీసుస్టేషన్‌కు మనోజ్ వచ్చారు. ఇటు మోహన్ బాబు కూడా మనోజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై మనోజ్ దాడి చేశారని మోహన్ బాబు ఆరోపిస్తున్నారు. తండ్రీ కొడుకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తమ కుటుంబం పై జరుగుతున్న ప్రచారాన్ని మోహన్ బాబు ఖండించారు. ఆస్తుల వివాదంపై మోహన్ బాబు రెండో తనయుడు మంచు మనోజ్ పై వినయ్ అనే వ్యక్తి దాడి చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారని మీడియా రిపోర్ట్ చేసింది. అయితే ఈ కథనాల్లో వాస్తవం లేదని మోహన్ బాబు ఫ్యామిలీ మీడియాకు తెలిపింది. అసత్య ప్రచారాలు చేయవద్దని కోరారు.