Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
Dadasaheb Phalke Award: మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు.
Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
Dadasaheb Phalke Award: మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. అక్టోబర్ 8న ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈమేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్’లో పోస్టు చేశారు. అలాగే సినిమా రంగానికి మిథున్ సేవలను కేంద్ర మంత్రి కొనియాడారు.
‘‘మిథున్ చక్రవర్తి అద్భుతమైన సినీ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తించి ఈ ఏడాది దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయనకు అందించాలని జ్యూరీ నిర్ణయించింది’’ అని మంత్రి తెలిపారు.''
ఇప్పటివరకు మిథున్ 24వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 1976 ఉత్తమ నటుడు – మృగయా, 40వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడు – తహదేర్ కథ, అలాగే 43వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటుడిగా స్వామి వివేకానంద సినిమాలకు అవార్డులు అందుకున్నారు.