Mishan Impossible Movie Review: మిషన్ ఇంపాజిబుల్ మూవీ రివ్యూ...

Mission Impossible Movie Review: ఎప్పుడో 2019 లో "గేమ్ ఓవర్" సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన తాప్సీ పన్ను...

Update: 2022-04-01 07:43 GMT

Mission Impossible Movie Review: మిషన్ ఇంపాజిబుల్ మూవీ రివ్యూ... 

Mission Impossible Movie Review: 

చిత్రం: మిషన్ ఇంపాజిబుల్

నటీనటులు: తాప్సీ పన్ను, హర్ష్ రోషన్, హర్ష వర్ధన్, భాను ప్రకాశన్, హరీష్ పెరాడి, వైవ హర్ష, సుహస్, సత్యం రాజేష్ తదితరులు

సంగీతం: మార్క్ కే రాబిన్

సినిమాటోగ్రఫీ: ఎస్ మనికందన్

నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి

దర్శకత్వం: స్వరూప్ అర్ ఎస్ జే

బ్యానర్: మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, పీ ఏ ఎంటర్టైన్మెంట్

విడుదల తేది: 01/04/2022

ఎప్పుడో 2019 లో "గేమ్ ఓవర్" సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన తాప్సీ పన్ను గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఇప్పుడు తాప్సీ "మిషన్ ఇంపాజిబుల్" అంటూ మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ" సినిమాతో మంచి హిట్ అందుకున్న స్వరూప్ ఆర్ ఎస్ జె ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా 2014 లో పాట్నా లో జరిగిన కొన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. ట్రైలర్ తో బాగానే ఆకట్టుకున్న ఈ సినిమా తాజాగా ఇవాళ అనగా ఏప్రిల్ 1, 2022 న థియేటర్లో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ అలరించిందో చూసేద్దామా..

కథ:

సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శైలజ (తాప్సీ) తో మొదలవుతుంది. ఒక రాజకీయ నాయకుడిని పదవి నుంచి దింపేసిన ఆమె తన నెక్స్ట్ మిషన్ ను మొదలుపెడుతుంది. రఘుపతి (సినిమా పిచ్చోడు), రాఘవ (టీవీ యాడిక్ట్) మరియు రాజారామ్ (క్రికెట్ లవర్). పేద కుటుంబాల్లో నుండి వచ్చిన ఈ ముగ్గురు పిల్లలు తిరుపతి దగ్గర్లో ఒక చిన్న పల్లెటూరు లో ఉంటారు. ఎలాగైనా దావూద్ ఇబ్రహీం ని పట్టుకొని యాభై లక్షల రివార్డు డబ్బులు చేజిక్కించుకోవాలని ఆ ముగ్గురు ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. కేవలం పది పన్నెండేళ్ళు ఉన్న ఆ ముగ్గురు పిల్లలు శైలజ కి తారసపడతారు. వారితో కలిసి మాఫియాడాన్ రామ్ శెట్టి చేసే చైల్డ్ ట్రాఫికింగ్ ను ఆపాలని శైలజ నిర్ణయించుకుంటుంది. మరి వారి మిషన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

ఇప్పుడు అద్భుతమైన స్క్రిప్ట్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకుని తాప్సి ఈ సారి మాత్రం తన సినిమా సెలక్షన్ తో ఏమాత్రం మెప్పించలేకపోయింది. సినిమా కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతూ ఉన్నప్పటికీ తన పాత్ర ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. అయితే నటన పరంగా మాత్రం తాప్సీ తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించింది. ముగ్గురు పిల్లల నటన కూడా ఈ సినిమాకి అతి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. వైవా హర్ష, సుహాస్, సత్యం రాజేష్ కామెడీ కూడా ఈ సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

"ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" సినిమా తో పోలిస్తే ఈ సినిమా లో డైరెక్టర్ స్వరూప అరెస్ట్ విభిన్నమైన కథను ఎంచుకొన్నారు. కొన్ని హార్డ్ హిట్టింగ్ సెన్సిటివ్ ఇష్యులను కూడా సినిమాలో చాలా సెన్సిబుల్ గా చూపించారు. మొదటి హాఫ్ లో పండిన కామెడీ సినిమా మొత్తం లేకపోవడం ప్రేక్షకులకు కొంచెం నిరాశ కలిగిస్తుంది. డైరెక్టర్ ఎంటర్టైన్మెంట్ పై మరి కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. మార్క్ కే రాబిన్ అందించిన సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ అందించిన విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

ముగ్గురు పిల్లల నటనఫస్ట్ హాఫ్ లోని కామెడీ

బలహీనతలు:

డైరెక్షన్ ఇమ్మెచ్యూర్ గా ఉండడం

స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేకపోవడం

లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు

చివరి మాట:

ట్రైలర్ లో కనిపించిన ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలన్నీ సినిమా మొదలైన అరగంటలోనే అయిపోతాయి. సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. మొదట 30 నిమిషాలు సినిమా బాగానే ఉన్నప్పటికీ తరువాత స్క్రీన్ ప్లే సీరియస్ టోన్ లోకి మారుతుంది. ఇక సెకండాఫ్ లో వచ్చే కొన్ని సస్పెన్స్ సన్నివేశాలు బాగానే ఆకట్టుకున్నాయి. ముగ్గురు పిల్లల నటన, డైలాగ్ డెలివరీ, సినిమాకి అతి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. చివరిగా "మిషన్ ఇంపాజిబుల్" సినిమా కేవలం కొన్ని సన్నివేశాలతో మాత్రమే ఆకట్టుకునే ఒక యావరేజ్ కామెడీ థ్రిల్లర్.

బాటమ్ లైన్:

బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన "మిషన్ ఇంపాజిబుల్".

Tags:    

Similar News